సుష్మా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ విదేశాంగ మంత్రి

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహముద్ ఖురేషి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేంతవరకూ ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ సుష్మాస్వరాజ్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల పై ఖురేషి సుష్మా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సుష్మాజీ ఈ వయసులో సిగ్గుపడుతున్నారు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ‘ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ సుష్మాజీ ఈ వయసులో సిగ్గు పడుతున్నారని నేను చెప్పలేకపోతున్నా’ అని న్యూయార్క్‌ భేటీ రద్దును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశమే ముందుకు రావట్లేదని ఖురేషీ అన్నారు. ఈ విషయంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత ప్రధాని మోదీకి లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదన్నారు. న్యూయార్క్‌ భేటీని కూడా భారతే రద్దు చేసిందని ఆయన అన్నారు.