ప్లీజ్ ఓట్ ఫర్ ..’భైరవగీత’: వర్మ

వాస్తవం సినిమా: ప్రముఖ దర్శకుడు శంకర్‌,సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌ సినిమా2 పాయింట్ 0 ఈ నెల 29న రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏ సందర్భానైనా తన సినిమా ప్రమోషన్‌ కోసం వాడేసుకునే వర్మ, 2 పాయింట్ 0ను కూడా భైరవగీత ప్రమోషన్‌ కోసం వాడుకుంటున్నాడు.

తాజాగా భైరవ గీత ప్రీ రిలీజ్‌ పార్టీలో పాల్గొన్న వర్మ.. 2 పాయింట్ 0 చిన్న పిల్లల సినిమా అంటూ తనదైన స్టైల్‌లో వివాదానికి తెర తీశాడు. ‘పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్‌ తీసిన చిన్న పిల్లల సినిమా 2 పాయింట్ 0, చిన్న పిల్లాడు అయిన సిద్ధార్థ్‌ తీసిన అడల్ట్‌ సినిమా భైరవగీత. పిల్లల సినిమా చూస్తారా.? పెద్దల సినిమా చూస్తారా? అంటూ అభిమానులను ప్రశ్నించాడు.
అయితే సెన్సార్ కి సంబంధించిన కొన్ని విషయాల కారణంగా భైరవ గీత ఆలస్యమవుతోందనీ, అందువలన ఈ సినిమాను ఎన్నికల రోజైన డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నామని చెప్పాడు. ప్లీజ్ ఓట్ ఫర్ ..’భైరవగీత’ అంటూ తాజాగా వర్మ ట్వీట్ చేశాడు. కన్నడ నటుడు ధనుంజయ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన ఇరా మోర్ కథానాయికగా కనిపించనుంది.