టీడీపీ కి 39 సీట్లు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన జెండా ఏపీలో ఎగర వేయాలని ఒక బలమైన రాజకీయ పార్టీగా వచ్చే ఎన్నికల్లో జనసేన ను నిలబెట్టాలని తహతహలాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాను చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎంతో సక్సెస్ అవుతున్నారు.. అయితే ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో టిడిపి పాలనలో అవినీతి భారీగా పెరిగిందని.. నీతి నిజాయితీలు ఇంటి పేర్లు గా చెప్పుకునే చంద్రబాబు ఏపీలో మాత్రం అవినీతి రహిత పాలన అందించడంలో విఫలం అయ్యారని పవన్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే చంద్రబాబు ,జగన్ లు ఇద్దరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పవన్ ప్రశ్నించారు..ఇదిలాఉంటే గత ఎన్నికల్లో నిస్వార్ధంగా ఏపీ ప్రజలకోసం టీడీపీకి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని కానీ టీడీపీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలు చేయలేదని ఆయన అన్నారు..

గత ఎన్నికల్లో జనసేన మద్దతు లేకపోతే టిడిపి కేవలం 39 నుంచి 40 సీట్లకి మాత్రమే పరిమితం అయ్యి ఉండేదని ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే అది జనసేన పార్టీ వల్లనే అనేది గుర్తుంచుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు..డ్వాక్రా మహిళల, పేద రైతుల రుణాలను మాఫీ చేయని ప్రభుత్వం టీడీపీ నేతలు తీసుకున్న కోట్లాది రూపాయలు ఎగ్గొడితే మాత్రం మాఫీ చేస్తోందని ఒక వేళ ఆ అప్పులు ఎగ్గొడితే చర్యలు శూన్యమని ఆయన ఫైర్ అయ్యారు.

యువత త్యాగాలు చేయాలని చంద్రబాబు కోరడం హాస్యాస్పదంగా ఉందని పవన్ అన్నారు. యువత త్యాగాలు చేసుకుంటూ పోతే చంద్రబాబు ,లోకేష్ రాజధాని రోడ్లపై తిరుగుతారా? అంటూ ప్రశ్నించారు…ఏపీ లో ఇసుక , మట్టి మాఫియా లు రెచ్చిపోతున్నా ఏమీ పట్టనట్టుగా ప్రభుత్వం ఉండటం దారుణమైన విషయమని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చంద్రబాబును ప్రశ్నించడం మాని తప్పుకు తిరుగుతున్నారని.. ప్రతిపక్ష నేతగా జగన్ అధికార పక్ష నేతగా చంద్రబాబు ఇద్దరు దొందూ దొందేనని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు…అంతేకాదు చంద్రన్నకి సెలవిద్దాం..జగన్ ని పక్కకి పెడదాం అంటూ కొత్త స్లోగన్ ప్రకటించారు..