బాబుకు షాక్ ఇచ్చిన…“జేడీ”

వాస్తవం ప్రతినిధి: టిడిపి అధినేత చంద్రబాబు కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీలో ఎలాగైనా సరే మరో మారు సీఎం కుర్చీ కొట్టేయాలని ఆశపడుతున్న తెలుగుదేశం అధినేత బాబు గారికి గడ్డిపరక ముట్టుకున్నా సరే ట్రాన్స్ఫార్మర్ల రేంజ్ లో షాక్ ఇస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మిత్రుడు గా ఉండి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషిస్తే, 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ని తన పదునైన వ్యాఖ్యలతో ఉతికి ఆరేస్తున్నాడు. ఇంకోపక్క ఎప్పటిలాగానే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టిడిపి పై టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలను చేస్తూనే ఉన్నారు అయితే..

వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని రాజకీయాల్లోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ సైతం చంద్రబాబు కి పంటికింద రాయిలా మారిపోయారు.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా జేడీ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో కాకరేపుతోంది..పవన్ జగన్ లకి తోడుగా జేడీ కూడా బాబు పై విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే

కొన్ని రోజులుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ సొంత పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చే పరిస్థితి ఇప్పట్లో లేదని తేలిపోయింది. అంతేకాదు నిన్నటి రోజున హైదరాబాదులో జరిగిన ఒక సమావేశంలో జేడీ మాట్లాడుతూ నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు సుమారు 13 జిల్లాల్లో ఎంతోమంది సమస్యల మీద పూర్తిస్థాయిలో అవగాహన తెలుసుకున్న వాడినని జేడీ ప్రకటించారు. ఇదిలా ఉంటే అభిమానులతో మేధావులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో జె.డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..

ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ చేరలేదని స్వతంత్రంగానే ముందుకు వెళ్తానని ప్రకటించారు. లోక్ సత్తా లో చేరాలని పిలుపు వచ్చినా అందరితో చర్చించి తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.. అంతేకాదు చంద్రబాబు పాలన పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. నవనిర్మాణ దీక్ష, పుష్కరాల పేరుతో టిడిపి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఏపీలో పోలీసులు ఉన్నారని సిబిఐ దర్యాప్తు అవసరం లేదని టిడిపి ప్రభుత్వం చెబుతోంది మరి అలాంటప్పుడు జగన్ పై దాడికి రాష్ట్రమే బాధ్యత వహించాలి కదా అంటూ లక్ష్మీనారాయణ బాబు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించారు అయితే చంద్రబాబుపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో బాబు ఇరకాటంలో పడ్డారనే చెప్పాలని..మరి జేడీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..