మరోసారి తన సహృదయాన్ని చాటుకొన్న స్టైలిష్ స్టార్

వాస్తవం సినిమా: మరోసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సహృదయాన్ని చాటుకున్నారు. తాను చేసిన చిన్న పొరపాటుకు  ‘టాక్సీవాలా’తో ఇటీవలే పరిచయమైన కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కు క్షమాపణలు చెప్పారు.

వివరాల్లోకి వెళితే ‘టాక్సీవాలా’ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో బన్నీ మాట్లాడుతూ సినిమాకు సంబందించిన అందరి పేర్లను ప్రస్తావించారు కానీ రాహుల్ గురించి మాట్లాడలేదు. ఈవెంట్ తరవాత ఈ విషయాన్ని గ్రహించిన బన్నీ సినిమా రిలీజ్ తరవాత ఇచ్చిన సక్సెస్ పార్టీలో రాహుల్ కు ఈవెంట్లో పేరు మర్చిపోయినందుకు సారీ చెప్పారట.