రాజస్థాన్ లో పర్యటిస్తున్న ట్రంప్ అల్లుడు

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ గురువారం భారత్ కు వచ్చారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు ఆయన వచ్చారు. తనతో కలిసి చదువుకున్న ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి కుమారుడి వివాహానికి హాజరుకావడానికి ఆయన రాజస్థాన్ కి వచ్చినట్లు సమాచారం. ఆయన రెండు మూడు రోజుల పాటు రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాజస్థాన్ లో భద్రతను కట్టుదిట్టం చేశామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.