ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలు

వాస్తవం ప్రతినిధి: ఆరుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి… జమ్ము అండ్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది… ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా… భద్రతాదళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.వివరాల ప్రకారం..

శ్రీనగర్‌ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మకాం వేశారన్న సమాచారంతో సైన్యం సోదాలు ప్రారంభించిన వేళ, విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.

సైన్యం ఎన్ కౌంటర్ ను ప్రారంభించగా, ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారని, ఇంకా ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని, అదనపు బలగాలను రప్పించామని అన్నారు. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.