పరమశివునికి ప్రత్యేక పూజలు చేసి, దీపాలను వెలిగించిన పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరమశివునికి ప్రత్యేక పూజలు చేసి, దీపాలను వెలిగించారు.నిన్న రాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు సమీపంలో గల ఎన్టీఆర్ పార్క్ లో తెలుగు టీవీ చానల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన, పరమశివునికి ప్రత్యేక పూజలు చేసి, దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ‘ఎన్ టీవీ’ చైర్మన్ చౌదరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు, కార్తీక దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.ఈ సందర్బంగా పలువురు పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.