వాస్తవం ప్రతినిధి: లగడపాటి సర్వే కి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఒక్క తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు యావత్ దేశంలో ఆయన సర్వే రిజల్స్ పై ఎంతో నమ్మకం ఉంచుతారు వివిధ పార్టీల నేతలు..గతంలో ఎన్నో సర్వేలు చేసిన లగడపాటి ఆ సర్వేలలో చాలా మటుకు నిజం అయ్యాయి కూడా. అందుకే లగడపాటి సర్వే అంటే చాలు ఏపీలో నేతలు అందరూ వణికి పోతుంటారు..అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వే లగడపాటిదే అంటూ హల్చల్ చేస్తోంది..ఆ సర్వేలో బాబు కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారట ప్రజలు..ఇంతకీ ఆ సర్వే ఏమి తేల్చింది అంటే..
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరుకి తెలుగు దేశం కొట్టుకుని పోతుందట..జనసేన పార్టీ ఏపీలో ఒక బలమైన రాజకీయ పార్టీగా అవతరించబోతోందని ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన పార్టీ ఒక బలమైన పార్టీగా ఏర్పడబోతోందని లగడపాటి సర్వే లో తేలిందని తెలుస్తోంది..అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టకపోయినా సరే అత్యంత కీలకమైన వ్యక్తిగా ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పడం ఖాయమని లగడపాటి సర్వే తెలిపిందట..
ఇదిలాఉంటే 2014 సంవత్సరంతో కేలవం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వలన మాత్రమే ఏపీలో అధికారంలోకి వచ్చిన బాబు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వలన ఈ సారి అధికారానికి దూరం కాబోతున్నాడని పరిశీలకులు కూడా అంటున్నారు..ఇంకా ఈ సర్వేలో విశేషాలు ఏమిటంటే..ఉభయగోదావరి జిల్లాలలో కేవలం జగన్ మోహన్ రెడ్డి , జనసేనాని మధ్య హొరాహొరి ఫైట్ ఉంటుందని..పశ్చిమలో కంటే కూడా తూర్పు గోదావరి జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకి లగడపాటి సర్వే ప్రకారం జనసేన ఎఫెక్ట్ అంతా ఈ సారి చంద్రబాబు పై ఎక్కువగా ఉంటుందని లగడపాటి తెల్చారట..మరి భవిష్యత్తులో బాబు పరిస్థితి మెరుగవుతుందా..జనసేన ధాటికి తట్టుకుని నిలబడగలదా వేచి చూడాల్సిందే..