చెన్నై పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాజధాని చెన్నై పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దక్షిణ భారత రాజకీయాల గురించి ఉత్తర భారత రాజకీయ నాయకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన అక్కడ మీడియాతో  మాట్లాడుతూ….. సినీ రంగంలో విజయవంతమై రాజకీయ అరంగేట్రం చేసిన రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశముందని తెలిపారు. అలానే దక్షిణ భారతంపై ఉత్తరాది నేతలకు మరింత అవగాహన ఉండాలని ఈ సందర్భంగా పవన్‌ అన్నారు. అలానే మహాత్మా గాంధీ, సర్థార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఉన్న సమయంలో సమస్యలు పరిష్కారమయ్యేవని, వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దేశ స్ఫూర్తిని అర్థం చేసుకునేవాళ్లని పవన్ అన్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా పవన్‌ చెన్నైలో పర్యటిస్తున్నారు. రెండో రోజు కూడా చెన్నై లో పవన్ పర్యటించారు.