అమృత్ సర్ గ్రెనేడ్ దాడి కేసును చేధించిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి: ఇటీవల పంజాబ్ లోని అమృత్‌సర్‌ లో గ్రెనేడ్ దాడి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రెనేడ్‌ దాడి కేసును అక్కడి పోలీసులు ఛేదించారు. ఆ గ్రెనేడ్ పాక్ లోనే తయారు చేసినట్లు  పంజాబ్ సీ ఎం తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి పురోగతి సాదించిన పోలీసులు ఈ దాడికి తెగబడ్డ ఇద్దరు నిందితుల్లో ఒకరైన బిక్రమ్‌జిత్‌ సింగ్‌ను లోహర్కా గ్రామ సమీపంలో బుధవారం అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. . పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తున్న ‘ఖలిస్థాన్‌ విమోచన దళం(కేఎల్‌ఎఫ్‌)’ కార్యకర్తగా అతణ్ని గుర్తించారు. బిక్రమ్‌జిత్‌ రాజసాన్సి ధరివాల్‌ గ్రామస్థుడు. కేఎల్‌ఎఫ్‌ అధినేత హర్మీత్‌ సింగ్‌ హాపీ పాక్‌లో తయారైన గ్రెనేడ్‌ను ఇచ్చినట్లు తెలిపాడు.