మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో

వాస్తవం ప్రతినిధి: అంతరిక్షంలో అధ్బుతాలను సృష్టిస్తున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది.అంతరిక్ష కేంద్ర వేదికగా సరిగ్గా ఈ నెల 29న పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీని ద్వారా ఒక స్వదేశీ, 30 బుల్లి విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేయనుంది. ఉపగ్రహాలను రాకెట్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. మనదేశ ఆధునిక భూపరిశీలన ఉపగ్రహం ఒక కక్ష్యలో, మిగిలిన ఉపగ్రహాలను మరో కక్ష్యలోకి చేరవేస్తారు.