బాబుకు ఝలక్…?? సుహాసిని తప్పుకుంటుందా..??

వాస్తవం ప్రతినిధి:  తెలంగాణలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ తనయ చుండ్రు సుహాసిని నిన్నటి రోజున నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆ సమయంలో బాలయ్య తో పాటు మీడియా ముందు మాట్లాడిన సుహాసిని తాత ఎన్టీఆర్ స్ఫూర్తి తో తండ్రి హరికృష్ణ మార్గంలో చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తా మంటూ ప్రకటన కూడా చేశారు ఆ తర్వాత… తమ్ముళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ లు తప్పదన్నట్లుగా తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా  తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు… ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది అంటున్నారు రాజకీయ పండితులు..

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చుండ్రు సుహాసిని పోటీపై ఆమె కుటుంబం  నుంచి తీవ్ర అభ్యంతరం వస్తోందని తెలుస్తోంది.. చివరకు కూకట్ పల్లి బరిలోంచి తప్పుకుంటే బెటర్ అనే అభిప్రాయం అందరిలోనూ ఉండటంతో నామినేషన్ వేసిన సుహాసిని అసలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు హరికృష్ణను వాడుకుని వదిలేసిన సంఘటనలు మొదలు2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ని ప్రచారంలోకి దింపి వాడుకుని వదిలేసిన సంఘటనల వరకు అన్నిటినీ బేరీజు వేసుకున్న హరికృష్ణ ఫ్యామిలీ మళ్ళీ మనం ఎందుకు చంద్రబాబు చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండాలి అనే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోందట..

అంతేకాదు భవిష్యత్తులో హరికృష్ణ ఫ్యామిలీకి జరగబోయే పరాభవాన్ని గురించి కూడా వారి చర్చకి వచ్చినట్టుగా తెలుస్తోంది.   ఇప్పటి వరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లినుంచి సుహాసిని ఓడిపోతే ఆ ఓటమి తాలూకు ఫలితం హరికృష్ణ ఫ్యామిలీపై ,ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు ఓడిపోయినట్టు కాకుండా హరికృష్ణ ఓడిపోయినట్టుగా తెలుగుదేశం వర్గాలు సొంత మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉందని చర్చించుకున్నట్లు గా తెలుస్తోంది..వారు అనుకున్నట్టుగా ఒకవేళ గెలిస్తే..??

హరికృష్ణ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అనే పెద్ద అపవాదు నుంచీ చంద్రబాబు నాయుడు బయట పడతాడు అదే సమయంలో ఏపీ లోకి హరికృష్ణ ఫ్యామిలీ రాకుండా సేఫ్ జోన్ లో ఉంటాడు. ఈ రెండు విషయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది..ఒక వేళ ఓడినా గెలిచినా అది మన కుటుంబంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చర్చించుకున్నారట …అంతేకాదు హరికృష్ణ చనిపోయిన సమయంలో కనీసం హరికృష్ణ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ భవన్ కి కూడా తీసుకు పోనివ్వకుండా చేసిన ఘనత చంద్రబాబు కి దక్కింది..కానీ 

ఆ సమయంలో బాబు అనుకూల మీడియా ద్వారా ఏవో కారణాలు చెప్పి మసి పూసి మారేడు కాయ చేసేశారు..కానీ హరికృష్ణ సమైక్య వాది అయినా సరే ఆయన మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి హరికృష్ణకు స్మారక స్థూపాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు…ముందు ముందు మనకి ఎంతో భవిష్యత్తు   ఉన్నది కాబట్టి ఒక్క సారి పునరాలోచించుకోమని కుటుంభ పెద్దలు తెలిపారట.

దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో సుహాసిని ఒకింత ఆలోచనలో పడినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. అయితే బాబాయ్ తో కలిసి నామినేషన్ వేసిన సుహాసిని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు వైపు మొగ్గు చూపుతారా..?? లేక చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కుకుంటారో..?? వేచి చూడాల్సిందే..అంటున్నారు విశ్లేషకులు.