ఎన్టీఆర్ ప్రచారానికి అడ్డుకట్ట వేసిన రాజమౌళి..??

వాస్తవం ప్రతినిధి: కూకట్ పల్లి అసెంబ్లీ బరిలో నందమూరి హరికృష్ణ తనయ చుండ్రు సుహాసిని బరిలోకి దిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే తెలివిగా చంద్రబాబు ఆమెని నందమూరి అంటూ తన సొంత డబ్బా మీడియాతో ప్రచారం చేయించి చుండ్రు ని కాస్తా నందమూరి చేయించాడు

.సరే చేస్తే చేశాడు..నందమూరి నాయకురాలు అంటూ హోరెత్తిస్తున్నాడు సరే చేస్తే చేశాడు..కానీ తనకి భవిష్యత్తులో కొరకరాని కొయ్యగా మారనున్న ఎన్టీఆర్ కి మాత్రం అక్కతో చెక్ పెట్టాడు..పెడితే పెట్టాడు లెండి ప్రజలకి అన్నీ తెలుసు కానీ..

ఎన్టీఆర్ అక్కతో పాటు ప్రచారానికి వచ్చేలా వ్యుహాలని రచించాడు అపర చాణిక్యుడు..ఒక వేళ వస్తే మేము అంతా ఒక్కటే ఇక మాలో ఎటువంటి గొడవలు లేవని, చంద్రబాబు, మేము ఒకే జట్టు అనే మెసేజ్ ప్రజలలోకి వెళ్తుంది.. వాస్తవానికి ఆ ఇమేజ్ ఎన్టీఆర్ కి ఇష్టం లేదు. ఎందుకనేది గతంలో వాడుకుని వదిలేసిన గుర్తులు తాలూకు సంఘటనలు ..అవి కూడా అందరికి తెలుసు ఇక పొతే..

ఒక వేళ ప్రచారానికి రాకపోతే..అక్కకోసం కనీసం ప్రచారానికి రాలేదు…తండ్రి ప్రేమించే టీడీపీ ని తండ్రి లేని తరువాత వదిలేశాడు..అంటూ టీడీపీ కి దూరం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఈ లెక్కలో భవిష్యత్తులో టీడీపీ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ కూడా లేకుండా చేసే అవకాశం కూడా లేకపోలేదు. దాంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులో రాజమౌళీ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్ళకుండా అడ్డుకట్ట వేశాడని టాక్ వినిపిస్తోంది..

అదేంటి రాజకీయాల్లో రాజమౌళీ దూరంగా ఉంటాడు కదా అనుకోవచ్చు కరక్టే కాని రాజమౌళీ కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్, చెర్రీ తో మొదలు పెట్టిన ఋఋఋ సినిమా షూటింగ్ 19 నుంచీ రెగ్యులర్ గా ప్రారంభం అవుతోంది. దాంతో ఈ షూటింగ్ ఒంకతో ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ ఉందని, తప్పించుకునే అవకాశం ఉందని, అయితే నిన్నటి రోజున తన అక్కకి ట్విట్టర్ ద్వారా ఎలాగయితే శుభాకాంక్షలు తెలిపాడో అలాగే ఎన్నికల సమయంలో ఓట్లు వేయండి అని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసే అవకాశం ఉండచ్చని లేకపోతే అసలు చేయకపోయినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు.