వాస్తవం ప్రతినిధి: తెలంగాణా రాష్ట్ర సీఎం కేసీఆర్ను ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎకనామిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముంబైలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు బదులుగా మంత్రి కేటీఆర్ ఆ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులు మీదుగా కేటీఆర్ ఈ అవార్డును స్వీకరించారు.