అవినీతికి “పచ్చ జెండా”…బాబు జీవో పై జేడీ ఏమన్నారు..??

 వాస్తవం ప్రతినిధి:  తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకాన్ని పోగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు, రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు బాబు ప్రవర్తిస్తున్నారని ఏపీలో సి.బి.ఐ అనుమతించకపోవడం కి కారణం మీ అవినీతిని అంగీకరిస్తునట్లేనా అంటూ వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలు మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ బాబు తీసుకున్న నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిబిఐ దేశంలో ఎక్కడైనా సరే తన అధికారాలను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన సంగతి నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబునాయుడు జారీ చేసిన ఉత్తర్వులు వలన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నివాసాలు కార్యాలయాల్లో పనిచేసే అవకాశం సీబీఐ కి ఉండదని, ఇక నుంచి ఏపీ ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు చేపట్టాలన్న సరే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుందని ఆయన అన్నారు..

సిబిఐ రాష్ట్రంలో ఎటువంటి సోదాలు దర్యాప్తు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులను ఎత్తివేయడం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మంచి పరిణామం కాదని, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల కారణంగా  ఉద్యోగులలో అవినీతి హెచ్చు మీరుతుందని. ఈ విధానం వలన అవినీతికి చంద్రబాబు గేట్లు ఎత్తేసినట్టేనని జేడీ వ్యాఖ్యానించారు..ఇదిలాఉంటే జేడీ మరొక విషయం స్పష్టం చేశారు..

ఏపీ ప్రభుత్వమే కాదు. దేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం సీబీఐ ఎంట్రీ కి నో చెప్పినా సరే కోర్టులు మాత్రం ఒకే చెప్తే ఆ జీవోలు ఒక్కటికూడా కోర్టుల ముందు పని చేయవని తేల్చి చెప్పారు..కోర్టులు ఆదేశిస్తే సీబీఐ ఎక్కడికి వెళ్లి అయినా సరే విచారణ చేపట్టవచ్చునని చెప్పారు జేడీ..అయితే చంద్రబాబు లాంటి వ్యుహకర్త ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆయనలో ఉన్న అభద్రతా భావాన్ని స్పష్టంగా తెలియపరిచినట్టేనని అంటున్నారు విశ్లేషకులు.