సుహాసిని ఎంట్రీ పై బాలయ్య ఏమన్నాడంటే..

వాస్తవం ప్రతినిధి: ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీని స్థాపించారో.. నందమూరి హరికృష్ణ ఏ స్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించారో.. ఆ ఆశయాలతో, ఆ స్ఫూర్తితో నందమూరి సుహాసినిని ఎన్నికల బరిలోకి దింపుతున్నామని టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ ఉదయం సుహాసినితో కలిసి బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తమ కటుంబంపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారని.. సుహాసినిపైనా అదే ఆదరణ చూపించాలని కోరారు. నందమూరి వంశం నుంచి తొలిసారి ఓ మహిళ ఎన్నికల బరిలోకి దిగడం సంతోషకరమైన విషయమని బాలయ్య అన్నారు. సుహాసినిని అత్యథిక మెజారిటీతో గెలిపించాలని.. అదే హరికృష్ణకు నిజమైన నివాళి అని అన్నారు. ఇక.. తెలంగాణలో మహాకూటమిదే విజయమని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. సుహాసిని విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ నేత పెద్దిరెడ్డి చెప్పారు.