“బండ్ల” కి బిగ్ షాక్..టిక్కెట్టు అందుకే రాలేదా..??

 వాస్తవం ప్రతినిధి:  టాలీవుడ్ లో హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. నిర్మాతగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకున్న ఏకైక వ్యక్తి బండ్ల గణేష్..బండ్ల కి సినిమాలు సంతృప్తిగా లేదని ప్రజాసేవలో తడిచి ముద్దయ్యి పోవాలని కలలు కన్నాడట అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను అంటూ రాహుల్ గాంధీ తో ఫోటో దిగి మరీ కాంగ్రెస్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. అయితే చివరికి కాంగ్రెస్ బండ్లకి కూడా హ్యాండ్ ఇచ్చింది..అసలు ఈ సంధి కాలంలో ఏమి జరిగింది..టిక్కెట్టు నాకు పక్కా అనుకున్న కమెడియన్ బండ్ల కి కాంగ్రెస్ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది..???

రాజకీయాలలో చించేస్తా , దంచేస్తా, అంటూ టిక్కెట్టు నాకేనని చెప్పిన బండ్ల గణేష్ రాజకీయాల్లో తనదైన మార్పు తీసుకువస్తానని తెలిపారు ఎన్నో సందర్భాల్లో టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు..అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక మూల స్థంభం లా బిల్డప్పులు కూడా ఇచ్చేశారు… పవన్ తన గురువని అంటూనే పవన్ విభేదించిన కాంగ్రెస్ పార్టీతో  జట్టు కట్టిన బండ్లమీడియా పవన్ విషయంలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళి పోవడం తిక్కతిక్కగా మాట్లాడటం హాస్యం చేయడం బండ్లకు గుదిబండగా మారాయి..ఆయన గారి తిక్కే ఇప్పుడు టిక్కెట్టు రాకుండా చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

టీవీ ఇంటర్వ్యూ లలో కూడా తనకు టిక్కెట్ రావడం పెద్ద కష్టమేమీ కాదని అంతా మా బాస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటాడని, తాను మామూలు వ్యక్తి కాదని, ఏకంగా నాలుగంటే నాలుగు రోజుల్లోనే ట్రంప్ పక్కన నుంచుని ఫోటో దిగే కెపాసిటీ ఉన్నవాడిననని , నాకు అంత పెద్ద సర్కిల్ ఉందని నోటికి వచ్చినట్లు పలు మాట్లాడాడు. బండ్ల ఇంటర్వ్యూ ఇచ్చిన విధానం గాని ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు చేసిన కామెడి చూసిన  ప్రజలు ఇలాంటి వాడా రాజకీయాల్లోకి వచ్చేదని అనుకోక మానరు..ఇదిలాఉంటే ఈ ఇంటర్వూ తాలూకు ఎఫెక్ట్ బండ్ల కి బాగానే తగిలింది..నువ్వు రాజకీయ నాయకుడిగా కంటే కూడా కమెడియన్ గా ఉండటం బెటర్ అంటూ షాక్ ఇచ్చింది.

కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల మొదటి,రెండవ జాబితాలలో మిస్ అయ్యింది.టిక్కెట్టు పై ఎన్నో కలలు కన్న బండ్ల కి బొమ్మ పడుద్ది అంటుకుంటే బొరుసు పడింది..దాంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..అయితే బండ్ల కి ఈ కాంగ్రెస్ చూపించిన సినిమా కధ లో నీతి ఏమిటంటే…కామెడీ సినిమాలలో చేయాలి కానీ రాజకీయ జీవితంలో కాదు అంటూ దిమ్మతిరిగేలా టిక్కెట్టు నిరాకరించింది..పార్టీలో ఉంటూ ప్రజలకి సేవచేయండి తరువాత చూద్దాం అనేట్టుగా హితబోధ చేసిందట..ఇదిలాఉంటే హైదరాబాదు లో పడిన గుంతలకి..మోడీ నోట్ల రద్దు కి లింక్ పెట్టిన బండ్ల తెలివికి తెలంగాణా ప్రజలే కాదు..కాంగ్రెస్ అధిష్టానం కూడా జాగ్రత్త పడిందని, కాంగ్రెస్ తెలివైన పార్టీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రెచ్చి పోతున్నారు..అంతేకాదు..ట్రంప్ తో టిక్కెట్టు వద్దు గాని కాంగ్రెస్ తరుపున తెలంగాణలో టిక్కెట్టు తెచ్చుకో చాలు అంటూ ఫైర్ అవుతున్నారట.