జగన్ పై తన వైఖరి స్పష్టం చేస్తున్న పవన్

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా  మూడు ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి ,జనసేన  తమదైన శైలిలో ఏపీ పట్టు సాధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మొదటిసారి ప్రత్యక్షంగా ఎన్నికల లోకి దిగుతున్న జనసేన పార్టీ లో ఈ మార్పు మరింతగా కనిపిస్తోందని , పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా పోరాట యాత్రలో అవలంబిస్తున్న తీరు ఎవరికీ అంతుబట్టడం లేదని టాక్ వినిపిస్తోంది..ఇదిలాఉంటే

గతంలో చంద్రబాబు కి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబుపై, చంద్రబాబు విధానాలపై ప్రజాపోరాట యాత్రలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని, లోకేష్ సీఎం చేయడానికి బాబు ఎందుకు తహతహలాడుతున్నారని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ కూడా జగన్ ని టార్గెట్ చేసిన దాఖలాలు లేవు.  కానీ గత నాలుగు రోజులనుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై కూడా ఫైర్ అవుతున్నారు.. గుంటూరు సభలో చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం బంధాన్ని తెంచుకున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత చంద్రబాబు లోకేష్ లని  టార్గెట్ చేశారు…అయితే అప్పటినుంచీ

పవన్ జగన్ ని ఎక్కడ విమర్శించింది లేదు అయితే గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తన రూట్ మార్చుకుని చంద్రబాబు లోకేష్ లని ఏ విధంగా అయితే విమర్శిస్తున్నారో ఇప్పుడు  అదేవిధంగా జగన్ ని కూడా పవన్ విమర్శిస్తున్నారు..అయితే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చడం వెనుక పరమార్థం ఏమిటి అనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ మూడు భాగాలుగా చీలిపోయింది ఒక వర్గం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంటే మరో వర్గం  వైసిపి కి అనుకూలంగా ఉంటోంది దాంతో  ఈ పరిణామాలను నిశితంగా గమనించిన పవన్ వ్యూహాలని మార్చినట్టుగా తెలుస్తోంది

రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్న సమయంలో ఇప్పుడు మరింతగా జగన్, పవన్ లపై రెచ్చిపోతే తప్ప ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఒక పక్క బాబును మరోపక్క జగన్ను అవకాశం దొరికిన ప్రతి సారి ఎకేస్తున్నారు పవన్ కళ్యాణ్…అయితే పవన్ అనుసరిస్తున్న వ్యూహం జనసేనకు ఏ మేరకు మైలేజ్ వస్తుందో చెప్పలేం కానీ మొత్తానికి పవన్ ఇరు పార్టీల అధినేతల పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.