సుహాసిని ఎంట్రీ… “ఎన్టీఆర్” కి ఇష్టం లేదా..???

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో టీడీపీ సీట్లని గెలుచుకునేందుకు చంద్రబాబు తనదైన చాణిక్య వ్యూహాలు అమలుచేస్తున్నారు. కాంగ్రెస్ మొదలు అన్ని పార్టీలు తమకి వచ్చిన సీట్ల ఆధారంగా అభ్యర్ధులని ప్రకటిస్తున్న తరుణంలో చంద్రబాబు మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కూకట్ పల్లి బరిలో ముందు నుంచీ పెద్దిరెడ్డి పేరు వినిపిస్తూ వచ్చిన తరుణంలో ఆయనకూడా తనకే టిక్కెట్టు వస్తుందని ప్రచారం చేసుకున్నారు అయితే టీఆర్ఎస్ పార్టీ తరపు సిట్టింగ్ ఎమ్మెల్యే కి ఆస్థానంలో బలమైన పట్టు ఉన్న నేపధ్యంలో చంద్రబాబు వ్యూహం మార్చారు.

కూకట్ పల్లి బరినుంచీ పెద్ది రెడ్డిని బదులు దివంగత నందమూరి.హరికృష్ణ తనయ సుహాసిని ని ఎంపిక చేశారు.అయితే నేరుగా ఈ విషయం చెప్పకుండా తన డప్పు మీడియా ద్వారా లీకులు ఇప్పించి మరీ ఆమె అభ్యర్ధిత్వాన్ని ఈరోజు ఖరారు చేశారు.కొద్ది కాలం క్రితమే హరికృష్ణ చనిపోవడం ఇప్పుడు ఆస్థానంలో ఆయన కూతురు గెలవడానికి సెంటిమెంట్ బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు..అంతేకాదు పైగా కమ్మ ఓట్లు అధికంగా ఉండటం, ఎన్టీఆర్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ మూడు అంశాలు ఆమెకి కలిసి వస్తాయట.

దాంతో బాబు ఆమెకి కూకట్ పల్లి నుంచీ సీటు కన్ఫర్మ్ చేసేశారు…ఇదిలాఉంటే ఈరోజు వైజాగ్ లోని నోవాటెల్‌ హోటల్‌లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసినట్లు ప్రచారం జరుగుతోంది...అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే. ముందు ఆస్థానం నుంచీ నందమూరి కళ్యాణ రామ్ ని దించాలని అనుకున్నారు..అయితే కళ్యాణ్ రామ్ ససేమిరా అనడంతో ఎన్టీఆర్ ని కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ విషయంలో అస్సలు ఒప్పుకోలేదని ఈ క్రమంలోనే ఎలాగైనా సరే హరికృష్ణ ఫ్యామిలీ నుంచీ ఎవరినైనా సరే దింపాలని అనుకున్న బాబు వ్యూహాత్మకంగా సుహాసినిని బరిలోకి దింపారు అయితే సుహాసిని రాజకీయాల్లోకి రావడం అది ఈ సమయంలో రావడం ఎన్టీఆర్ కి ఇష్టం లేదట ఇద్దరు అన్నయ్యలని ఇష్టం లేకపోయినా సరే సుహాసిని బాబుని కలవడానికి వెళ్ళడం తో అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ లో ఏమి జరుగుతోంది అనే ఆసక్తి నెలకొంది.