ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతున్న కాంబో  

వాస్తవం సినిమా: విజయ్ 62వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘తెరి’ .. ‘మెర్సల్’ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ కాంబినేషన్లో మూడవ చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో కథానాయికలుగా నయనతార .. సమంత కనిపించనున్నారని సమాచారం. గతంలో ఈ ఇద్దరూ విజయ్ తో కలిసి విజయాలను అందుకున్నవారే. క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన అట్లీ కుమార్ .. సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. విజయ్ తో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో అట్లీ కుమార్ గట్టిగానే కసరత్తు చేస్తున్నాడట.