2019 ఎన్నికల్లో జనసేనాని వ్యూహం ఇదేనా..??

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలకు పార్టీలన్నీ సర్వం సిద్ధమయ్యాయి. 2019 లో గెలుపే టార్గెట్ గా చేసుకున్న ప్రధాన ప్రతిపక్ష వైసిపి అందుకు తగ్గట్టుగానే తమ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. వైసిపికి ప్రస్తుతం కలిసి వస్తున్న ఏకైక అంశం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. టీడీపీకి మాత్రం వచ్చే ఎన్నికలు పెద్ద అగ్ని పరీక్షగా మారిపోయాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చిన రాకపోయినా అధికార పార్టీని మాత్రం చెప్పుచేతల్లో తీసుకోవాలనేది జనసేనాని వ్యూహంగా తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చారు అయితే… ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున టిడిపి పై చేసిన దండయాత్ర తో బాబుకు భవిష్యత్తు సినిమా కనబడి పోయింది.. ఆ రోజు మొదలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ,లోకేష్ లని రోజుకో రకంగా చీల్చి చెండాడడం మొదలుపెట్టారు..


ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. అది ఏంటంటే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ముందు రెండే రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి , పార్టీని మరొక పార్టీ తో కలుపుకుని ఒక జట్టుగా ఎన్నికలకు వెళ్లి పోరాడి అధిక సీట్లు గెలుచుకోవడం. లేదా సొంతంగా ఎన్నికల్లో పాల్గొని సాధ్యమైనంత సీట్లను దక్కించుకుని అధికారంలో వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి జనసేన పార్టీ భావాలను, ఆశయాలను అమలయ్యేలా చేయడం.

అయితే ఈ రెండు అంశాలలో పవన్ కళ్యాణ్ రెండవ దారిని ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు,అంతేకాదు అదే పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధానమైన మార్గమని వారి వాదన. పవన్ ఒక్కడిగా ఎన్నికల దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతానికి కష్టమైన పని కాబట్టి ఆ రెండో మార్గాన్ని ఎంచుకోవడం వలన ఎంచుకోవడం వలన తనదైన పాలనను ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించవచ్చని ఈ విధంగా చేయడం వలన ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ని పతనావస్థకు చేయడమే కాకుండా ఏపీలో అత్యంత కీలకమైన పార్టీగా జనసేన ను మరింత బలంగా నిర్మించవచ్చని బహుశా పవన్ కళ్యాణ్ వ్యూహం కూడా ఇది అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ గనుక 40 స్థానాల్లో గట్టిగా బలం చూపించి గెలుచుకుంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం మాత్రమే కాకుండా టిడిపిని ఊసు లోకి లేకుండా చేయవచ్చని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.. అంతేకాదు 40 గెలుపు స్థానాలు జనసేన ఖాతాలో ఉంటే ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు..ఒక వేళ పరిస్థితులు మారిపోయి అత్యధిక స్థానాలు పవన్ కళ్యాణ్ గెలుచుకుంటే ఏపీ ని నడిపించే రాధ సారధి తానె కావచ్చు అనేది రాజకీయ పండితుల అభిప్రాయం.