మోడీ బలే దొరికేశాడుగా…!!!

వాస్తవం ప్రతినిధి : ప్రధాన మంత్రి మోడీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఎవరి ఊహలకి సైతం అందనంత రీతిలో ఎదిగిన నేత. 2019 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే కాకుండా పెద్దగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలలో సైతం తనదైన రాజకీయంతో మద్దతు పెంచుకున్నాడు. ప్రాంతీయ పార్టీలని తన గుప్పెట్లో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా కేంద్రంలో ఎగరేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు..తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఓటు బ్యాంక్ పోగొట్టుకోకుండా తన రాజకీయ ఎత్తుగడలలో భాగంగా నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ”  మోడీ కి గుజరాత్ లో భారీ మైలేజ్ తెచ్చి పెడుతుందని అనడంలో సందేహం లేదు.

ఇదిలాఉంటే ఒక పక్క స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ” పై ఎన్నో విమర్శలు , ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. కొన్ని వేలకోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ పని చేయడంలో అర్థం ఏముంటుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. నర్మదా  నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తయిన సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఎవరి స్వార్ధం కోసం పెట్టారో చెప్పాలని డిమాండ్ లు పెరుగుతున్నాయి…అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై ఎంతగా రచ్చచేయాలని చూసినా ఆ అవకాశం దక్కడం లేదు..

అయితే తాజాగా ఈ ఘటనకి సంభందించి మోడీ పరువుని రోడ్డుకి ఈడ్చే విధంగా బ్రిటన్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో సరైన ఆయుధంగా దొరికాయి.  ఒక విగ్రహాన్ని కట్టడం కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలా అంటూ మోడీకి  దిమ్మతిరిగేలా  ప్రశ్నలు సంధించింది బ్రిటన్. 2012 మొదలు ఇప్పటి వరకూ    దాదాపు రూ. 11వేల కోట్లు సాయంగా అందిస్తే.. అందులో దాదాపు రూ 3 వేల కోట్లు ఈ విగ్రహానికే ఖర్చు చేశారని బ్రిటన్‌ అధికారపక్ష ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు.. భారత్ లో విగ్రహాలకి అంతంత ఖర్చులు చేసేవారికి మేము అందించే సాయం పెద్ద లెక్కకాదని అర్థమవుతోందని. ఇక మా సాయం భారత్ కి అవసరం లేదని అర్థం అవుతోందని  బ్రిటన్ వ్యాఖ్యానించింది. తాము ఐదేళ్ళలో  భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను ఇచ్చామని, మహిళల హక్కులకు సంబంధించి,పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు అందించామని అన్నారు …అయితే ఇప్పుడు బ్రిటన్ పటేల్ విగ్రహంపై స్పందించిన తీరుతో ఇప్పటికే మోడీ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ కి మోడీ ని ఎకేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.