ధర్మ పోరాట దీక్షకి బాబోరి..భారీ స్కెచ్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆత్మ ఘోషించేలా చంద్రబాబు రాహుల్ తో చేయి చేయి కలపడం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది.. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా సరే తన రాజకీయ మనుగడకు కాంగ్రెస్ పార్టీతో జట్టు తప్పదని ఎప్పుడో ఫిక్స్ అయిపోయిన చంద్రబాబు ప్రతిపక్షాల విమర్శలను చాలా లైట్ తీసుకుంటున్నారు.

చంద్రబాబు తన మనుగడ కోసం, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇన్నేళ్లు మోసిన టిడిపి పార్టీ యొక్క  ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టేశారు…ఎవరు ఏమన్నా సరే తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే చంద్రబాబు  తనపై విమర్శలు రాకుండా  కాంగ్రెస్ టీడీపీ బంధాన్ని సొంత మీడియాతో మసి పూసి మారేడు కాయ చేశారు. ఈ క్రమంలోనే ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు మరోసారి ధర్మ పోరాట దీక్షకు దిగుతున్నారు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

కేంద్రం , ఎపీకి తీరని అన్యాయం చేసిందని దానికి నిరసనగా చంద్రబాబు నాయుడు గతంలో ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈసారి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకి బాబు  బీజేపీ యేతర పార్టీలను కూడా ఆహ్వనించనున్నారట…కేంద్రం పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది టిడిపి ఎప్పటినుంచి ఆరోపిస్తోంది. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గతంలోనే 7 ధర్మపోరాట దీక్షలు చంద్రబాబు నిర్వహించారు..అయితే

ఈనెల 10వ తేదీన నెల్లూరులో, 27 తేదీన విజయనగరంలో కూడా ఈ దీక్షను చేపట్టనున్నారు..ఈ వేదికలపై బీజేపీ యేతర పార్టీలని ఏకం చేయడం ద్వారా “మోడీ, షా” లు ఏపీలో టీడీపీ ని ఇబ్బంది పెట్టడానికి పన్నుతున్న వ్యుహాలకి బ్రేక్ వేయవచ్చు అంటున్నారు…ఈ దీక్ష ద్వారా బాబు ఏమి చేయాలనీ అనుకుంటున్నారనేది పక్కన పెడితే..ఈ వేదికలపై ఏపీలో టీడీపీ పక్కన కాంగ్రెస్ ఉంటే మాత్రం భవిష్యత్తులో భారీ నష్ట్గం జరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు…మరి కేంద్రాన్ని ఇరకాటంలో నెట్టడానికి బాబు వేసిన భారీ స్కెచ్ ఫలిస్తుందా లేదా అనేది త్వరలో తేలిపోనుంది.