వ్యుహమా..?? భయమా…?? బాబు ఇదేమి రాజకీయం..??

వాస్తవం ప్రతినిధి: రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు తరువాతే..ఆయన్ని మించిన ఘనుడు దేశంలోనే లేడు అనేట్టుగా సందర్భం దొరికినా, దొరకకపోయినా సరే బాబు డప్పు బ్యాచ్ చెప్పే శ్రీరంగ నీతులు ఇవే..అయితే నిజంగానే బాబుకి అపరచాణిక్యుడుగా పేరుంది. గతంలో ఎంత చేశాం , ఏమి సాధించాం అనేది ప్రస్తుతానికి పనికిరాని అంశం. అయితే ఇప్పుడు ఏమిటి అనేది ఎంతో ముఖ్యమైన విషయం..ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో 2014లో బీజేపీతో, ఇప్పుడు తాజాగా బద్ధ శత్రువుగా టీడీపీ నేతలు భావించే కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు కి ఆత్మ గౌరవం ఉందా అనే ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు..దాంతో అందరికి క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఏ పని చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అయితే ఇది రాష్ట్ర ప్రయోజనం కోసమా లేక మీ ప్రయోజనం కోసమా అసలు కాంగ్రెస్ తో కలవడానికి గల కారణాలు ఏమిటి అంటూ చర్చ జరగడంతో తూచ్ తూచ్..కాంగ్రెస్ తో జట్టు కేవలం ఇది జాతీయ అవసరమని చెప్పుకొస్తున్నారు.

ఇదిలాఉంటే కోడి కత్తి ఇష్యూ ని మెల్లగా కనుమరుగు కానిచ్చి ఢిల్లీ టూర్స్ పేరుతో ఎలాగోలా జగన్ పై దాడి అంశాన్ని పక్క దారి పట్టించాలని చూస్తున్నారు బాబు..అయితే బాబు అసలు రాహుల్ తో దోస్తీ కోసం ఎందుకు అంతగా పరితపించారు అంటే..దానికి చాలానే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి కేంద్రంలోని ఏదో ఒక పార్టీతో సంబందాలు నెరపకుండా బాబు ఉండలేరా అంటూ సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి..అధికారంలో లేనిరోజుల్లోనూ కేంద్రంలోని ప్రభుత్వంతోనో విపక్షాలతో సంబంధాలు పెట్టుకునే వారు చంద్రబాబు.

గత ఎన్నికల్లో మోడీని ప్రధానిగా చేసింది మేమేనని అయితే ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నామని చెప్పిన బాబు మాటలని ఒకసారి పరిశీలిస్తే..ఇక్కడ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా? ఉంటే ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకొన్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి..ఇదిలాఉంటే బాబు చెప్పిన అతిపెద్ద జోక్ ఏమిటంటే.. కాంగ్రెస్‌తో జట్టు కట్టడం కూడా ఏపీ ప్రజల మనోభావమేనని, బీజేపీని ప్రజలు తిట్టిపోస్తున్నారని చెప్పడంతో షాక్ అయ్యారు ప్రజలు..అసలు

ప్రజలు కాంగ్రెస్ తో జట్టుకట్టమని ఎలా అడుగుతారు..?? ఏ విధంగా చెప్తారు..??ప్రజల నుంచీ ఈ విషయాన్ని ఏ సర్వేలు చేయించి తెలుసుకున్నారు అంటే బాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి..ఎవరి అభిప్రాయాలు తీసుకుని కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు రెడీ అయ్యారు? అంటే ఏమి మాట్లాడాలో తెలియని దుర్భర పరిస్థితిలో ఈరోజు బాబు ఉన్నారట. అయితే బాబు అలా మాట్లాడటం వెనుక అసలు వ్యూహం వేరే ఉందని, తనపై నమోదైన కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉండడం, వీటిపై విచారణలు స్టేలో ఉండడంతోనే ఆ కేసుల తాలూకు లొసుగుల నుంచి బయటపడటానికే బాబు కేంద్రంలో అధికారం కోసం నోళ్ళు వెళ్ళబెట్టుకుని కూర్చున్న కాంగ్రెస్ తో జట్టుకట్టరాని,బాబు తన ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో జట్టుకట్టారు తప్ప ఇందులో వ్యూహం ఏమిలేదని మోడీ వలన వచ్చిన భయం మాత్రం బాబుని వెంటాడుతోందని అంటున్నారు విశ్లేషకులు.