“ఆ స్థానంలో”…గెలుపుకోసం పట్టు..పట్టిన పవన్…!!!

వాస్తవం ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష పోరుకి సై అనడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించాయి. జనసేనాని ఊహించని రీతిలో యాత్రలు చేపడుతూ ప్రజలో విశేష ఆదరణ చొరగోన్నాడు. తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ప్రజలని ముఖ్యంగా యువతని తనవైపుకు తిప్పుకోవడంతో పవన్ సక్సెస్ అయ్యాడు. కవాతు ద్వారా పవన్ కళ్యాణ్ తన స్టామినా ఇదీ అంటూ ప్రధాన పార్టీలకి ఒక సవాల్ విసిరాడు..అయితే పవన్ ప్రత్యక్ష పోరుకు కాలుదువ్విన క్షణం నుంచీ పవన్ వేసే ప్రతీ అడుగును పరిశీలిస్తే ఉభయగోదావరి జిల్లాలే ప్రధానమైన టార్గెట్ గా పవన్ వ్యుహాలని సిద్దం చేసుకున్నాడని తెలుస్తోంది.

జనసేనాని తన సొంత జిల్లాలు అయిన పశ్చిమ , తూర్పు గోదావరి జిల్లాలలో భారీస్థాయిలో సీట్లు గెలుపొందాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పశ్చిమలో ఒక స్థానంపై గెలుపు కోసం పట్టు పట్టాడని, అందుకోసం పార్టీలోని కొందరు సీనియర్ నేతలతో, ఆ నియోజకవర్గ నేతలతో పవన్ ఇప్పటికే అనేక సార్లు భేటీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది..ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుపొందాలనేది రాజకీయ నీతి ఇప్పుడు పవన్ ఈ వ్యుహాన్నే ఫాలో అవుతున్నాడట.

ఇంతకీ పవన్ పట్టు పట్టిన స్థానం ఏమిటంటే..తన అన్నయ్య చిరంజీవి పోటీ చేసి ఓడిపోయిన పాలకొల్లు నియోజకవర్గమే. ఈ స్థానం నుంచి ఎలాగైనా సరే జనసేన పార్టీ గెలుపొంది తీరాల్సిందేనని పవన్ ఎంతో పట్టుదలతో ఉన్నాడట..అందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలో ఇప్పటికే పక్కా ప్రణాళికని రచించాడట జనసేనాని.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే..పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచీ పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.ఒక వేళ అదే నిజమైతే క్షీరపురినుంచి పశ్చిమలో తొలి గెలుపుని పవన్ ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.