టీడీపీపై పవన్ “వ్యూహాత్మక అడుగులు”..సైలెంట్ గా “సెంటర్” చేశాడు

వాస్తవం ప్రతినిధి: తిత్లీ తుఫాను శ్రీకాకుళం ప్రజలకి ఎంతటి నష్టాన్ని కలిగించిందో తెలియదు కాని , తెలుగుదేశం పార్టీకి మాత్రం నష్టాన్ని మిగిల్చింది..టీడీపీ కి కలిగిన నష్టాన్ని పవన్ కళ్యాణ్ తన పదునైన వ్యాఖ్యలతో భారీ నష్టంగా మార్చారు..భాదితుల గోడుని నేరుగా తెలుసుకుంటూ పుస్తకం ,పెన్ను వెంట తీసుకుని మరీ వారి భాదల్ని తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్ తదనంతరం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పై చేస్తున్న కామెంట్స్ కి టీడీపీలో సీనియర్స్ కే మైండ్ బ్లాక్ అవుతోందట..ఎవరో రాసిచ్చిన డైలాగులు కావవి..ఎవరో చెప్తే బట్టీ పట్టి మరీ అప్పచెప్పే వ్యాఖ్యలు కావవి..కేవలం గుండెలో నుంచీ వస్తున్న పదునైన వ్యాఖ్యలు. అందుకే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడానికి కూడా సాహసం చేయలేక పోతున్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు నాయుడుకి కేవలం తిత్లీ తుఫాను ఒక ప్రచార సాధనంగా మారిందని నిజంగా భాదితులకోసం బాబు ఏమి చేశారో చెప్తే అది కూడా నోట్ చేసుకుంటానని పవన్ చేస్తున్న డైరెక్ట్ అటాక్ తో బాబు విస్తు పోతున్నారు. తిత్లీ తుపాను భయంకరంగా కదలి వస్తోందని తెలిసినా బాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారంటూ పవన్ చేసిన విమర్శ ధాటికి ప్రజల నుంచీ వచ్చిన వ్యతిరేకతతో ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడుని భాదిత ప్రజలు తరిమి తరిమి తమ ఊళ్ళ నుంచీ వెనక్కి పంపేలా చేశాయి..

అంతేకాదు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వలన ఒరిగేది ఏమి లేదని తుఫాను సహయం మొదలైన రెండవ రోజే పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనతో కేంద్రం వెనకడుగు వేసిందని పవన చెప్పిన మాటలు అధికార పార్టీని నోరు కూడా తెరవనివ్వలేదు. నాలుగు రోజుల పాటు తిత్లీ తుపాను ప్రాంతాలలో విస్త్రుతంగా పర్యటించి వచ్చిన పవన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పి మరీ టీడీపీని ఉతికి ఆరేశారు..కేవలం రోడ్డు పక్కన ఉన్న గ్రామాలకే సహాయం అందుతోందని మారు మూల గ్రామాలను టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదని పవన్ చేసిన వ్యాఖ్యలు నిజమని నమ్మవలసిన పరిస్థితి పవన్ వెళ్ళిన గ్రామాల ప్రజల గోడుని చూస్తే అర్థమవుతుంది.

ఇదిలాఉంటే పవన్ తన వ్యాఖ్యలతో ఒక్క సారిగా టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు అదేంటంటే..తిత్లీ తుపాను సహాయంలో రాజకీయాలు చేయడం మొదలు పెట్టారని భాదితుల వద్దకూడా రాజకీయాలు ఏంటని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తిత్లీ తుపాను వల్ల గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతే కేవలం టీడీపీ సానుభూతిపరులకి మాత్రమే సహాయం అందించడమేంటి అంటూ పవన్ సూటిగానే ప్రశ్నించారు..కేవలం అధికార పార్టీ ఈ తుఫాను పై చేస్తున్న వ్యాఖ్యలు పంచి పెడుతున్న పొట్లాలు మీడియాలో ఫోకస్ అవుతున్నాయి తప్ప ప్రజల భాధలు ఎక్కడా కనపడటం లేదని పవన్ విమర్శించారు..పవన్ సంధిస్తున్న ప్రతీ ప్రశ్నకి బాబు సమాధానాలు వెతుక్కోవలసి వస్తోందట..ఏది ఏమైనా తిత్లీ ని వాడుకుని హైలెట్ అయిపోవాలని అనుకున్న టీడీపీ తిత్తి తీసున్న పవన్ కౌంటర్స్ జనసేన పార్టీనెలకి మంచి జోష్ ఇస్తున్నాయట.