“బాబు” గారు మరీ ఇంతకి “దిగజారి పోవాలా”…??

ప్రపంచంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో ఉద్దండ పిండం బాబు గారు ఒక్కరే అనడంలో సందేహం లేదు.. “ఆయనకి ఆయనే సాటి బాబు కి లేరెవరు పోటి” అంటూ వైసీపీ వాళ్ళు అప్పుడప్పుడు సెటైర్స్ కూడా పేల్చుతూ ఉంటారు..అయితే ప్రతీ చిన్న విషయాన్ని వాడేసుకుని మీడియాని మ్యానేజ్ చేసేసుకునే బాబు గారుమహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు సమన్లు పంపితే. దాన్ని కూడా భారీ స్థాయిలో వాడేసుకున్నారు.. అలాగే  కేంద్రంతో చెత్తా పట్టాలేసుకుని తిరిగిన నాళ్ళు పత్యేక హోదా అంటే అది సంజీవని కాదు అన్నప్పుడు మీడియా మ్యానేజ్ బాగా చేసుకున్నారు..

Image result for chandrababu naidu fire on media in srikakulam

అదే సమయంలో బీజేపీ తో తెగ తెంపులు చేసుకుని హోదా వస్తేనే అన్నీ వస్తాయంటూ  యూటర్న్ తీసుకున్న సమయంలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా బాబు మీడియాని వాడుకున్నారు..ఇక తాజ్గాగా శ్రీకాకుళం తుఫాను విషయంలో మీడియా అసలు పట్టించుకోలేదని..కనీసం కేరళా తుఫానుకిచ్చిన ప్రాధాన్యతలో సగం కూడా  ఉద్దానం తుఫానుకు మీడియా ఇవ్వలేదని బాబు ఆరోపించారు..ఇక్కడ ఎంతో అద్భుతంగా పునరావాసంపునరుద్ధరణసహాయక చర్యలు చేపడుతుంటే తమకి మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వడం లేదని బాబు మండిపడ్డారు.

Image result for chandrababu naidu fire on media in srikakulam

బాబు చేసిన ఆరోపణలపై ఒక్కసారిగా మీడియా లోకం మొదలు ఏపీ ప్రజానీకం ముఖ్యంగా భాదిత ప్రాంతాల ప్రజలు ముక్కున వేలేసుకున్నారు..నిజానికి ఎక్కడైనా ప్రజలకు సేవ చేయడం పైనే సీఎంలు ప్రాధాన్యం ఇస్తారు. దృష్టి పెడతారు. కానీచంద్రబాబు ఇలాంటి సమయంలో కూడా కవరేజ్ లేదని కక్కూర్తిగా ఆలోచించడంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో నెటిజన్లు బాబు కి తలంటేశారు..ఇక మరొక దారుణమైన విషయం ఏమిటంటే…

Image result for chandrababu naidu tithli effect tour

చంద్రబాబు భాదిత ప్రజలని సైతం  ప్రతిపక్షాలని తిట్టినట్టుగా తిట్టేశారట..ఎందుకంటే అక్కడ ప్రజలని పరామర్శించాడానికి బాబు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరుగా చంద్రబాబు పై రుసరుసలాడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఖంగుతిన్న బాబు ఒక్క సారిగా వాళ్ళందరూ ప్రతిపక్షం తొత్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారట. అంతేకాదు నిరాశ్రయులు అయిన ప్రజలకి అందించే సరుకులు తిండి వస్తువులు నాసిరకంగా ఉండటంతో వారినుంచీ తీవ్ర వ్యతిరేకత రావడంతో చాలా మంది నిరసనలు తెలిపారట…అయితే నిరసనలు తెలిపిన ప్రతీ ఒక్కరిని బాబు వీళ్ళందరూ ప్రతిపక్షం మనుషులు అంటూ వ్యాఖ్యానించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అంటున్నారు.