“పశ్చిమ” లో జనసేన “సైలెంట్ సర్వే”..ఎందుకంటే..??

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ వైపు తన దృష్టిని పూర్తి స్థాయిలో కేంద్రీకరించాడా..?? పశ్చిమ , తూర్పు ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని కీలక సర్వేలని చేయిస్తున్నాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి..గత కొంతకాలంగా ఈ వ్యవహారాని పార్టీలో కీలక వ్యక్తులకి తప్ప మరెవ్వరికి తెలియకుండా కొన్ని సర్వేలు జరుగుతున్నాయట…ఈ సర్వేలు ఎందుకు ఏమిటి అనే వివరాలలోకి ముందుగా వెళ్తే..

2014 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ అధికారంలో నిలబడేలా అత్యంత కీలకంగా వ్యవహిరించింది..అందుకే ఈ సారి 2019 ఎన్నికలలో మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు జనసేనాని…అటు ప్రభుత్వాన్ని, ఇటు విపక్షం వైసీపీని కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు. కులాలకు అతీతంగా పవన్ కి చేరువవుతున్న వారికో ముఖ్యంగా యువత ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలాఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కొక్క జిల్లాని ఒక్కో రకంగా టార్గెట్ చేస్తున్నారు.

అన్ని చోట్లకంటే కూడా ఉభయగోదావరి జిల్లాలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు…అయితే ఈ రెండిటిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇక్కడ నుంచి కీలక నాయకులను పార్టీ తరఫున నిలబెట్టి గెలిపించుకోవడంపై ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన పెద్ద ఎత్తున రహస్యంగా సర్వే చేయిస్తున్నారని సమాచారం…ఈ సర్వేలో అభ్యర్థుల ఆర్ధిక స్థోమత, రాజకీయ అనుభవం..వగైరా వగైరా అంశాలతో నివేదికలు తయారు చేస్తూ అభ్యర్ధుల అర్హతలని కూడా బేరీజు వేస్తున్నారట.

మరీ ముఖ్యంగా బీజేపీ..టీడీపీ…వైసీపీల నుంచి వచ్చే నాయకులు ఎవరు? ఎటువంటి పరిస్థితుల్లో వారు జనసేనలో చేరే అవకాశం ఉంది? అన్న అంశాలపై సర్వే కీలక దృష్టి పెట్టినట్టు తెలిసింది…ఈ సర్వేలు తూతూమంత్రంగా కాకుండా ఎంతో ఖచ్చితమైన అంశాలతో కూడి అభ్యర్ధుల ఎంపిక జరుగుతోందట . అందుకుగాను పవన్ కళ్యాణ్ మాజీ పోలీసు అదికారులను, ముఖ్యంగా ఇంటిలిజెన్స్‌లో పనిచేసిన వారిని వినియోగించుకుంటున్నారని సమాచారం..ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సీక్రెట్ సర్వే పవన్ కి కలిసొస్తుందో లేదో భవిష్యత్తులో తేలిపోనుంది.