అన్నగారు పెట్టిన టీడీపీకి ..బాబు తెలంగాణలో మకిలి పట్టిస్తున్నాడు..!!

వాస్తవం ప్రతినిధి: నందమూరి తారక రామారావు తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి అంధ్రప్రదేశ్ లో ఎంతో ఘన చరిత్ర ఉంది..తెలుగోడు ఏమిటి ఢిల్లీ కాంగ్రెస్ ముందు వంగి వంగి సలాములు కొట్టడం ఏమిటి అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఆనాటి ప్రజలని కదిలించాయి..అప్పట్లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా, తెలుగోడి పార్టీగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ గతం ఎంతో ఘనం..అయితే ఈ నాడు అదే గతాన్ని తుంగలోకి తొక్కి మరీ టీడీపీ ని మళ్ళీ అదే కాంగ్రెస్ కాళ్ళకింద కాంగ్రెస్ చెప్పుచేతల్లో ఉండేటట్టు చేసేశారు. అందుకు నిదర్శనమే తెలంగాణలో టీడీపీ పరిస్థితి..

తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అనడంతో సందేహం లేదు టీడీపీ నుంచీ ఎంతో మంది సీనియర్ లీడర్స్ టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు చిన్నా చితకా తప్ప పార్టీలో పెద్దగా చెప్పుకోవడానికి ఎవరూ లేరు అయితే టీడీపీ కి తెలంగాణలో కలిసొచ్చే అంశం ఏదన్న ఉందంటే అది కేవలం ఆంధ్రా ఓటర్లు అదేసమయంలో టీడీపీ కి కొద్దో గొప్పో మిగిలిఉన్న కేడర్..ఈ రెండూ మినహా టీడీపీకి తెలంగాణలో పెద్దగా పట్టులేదనే చెప్పాలి..అంతేకాదు టీడీపీ పరిస్థితి ఎంతటి దయనీయంగా మారిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు దయపెడితే అన్ని తీసుకోవడానికి సిద్దమయ్యిపోయింది.

ఇప్పుడు టీడీపీ కూటమి కట్టిన మహాకూటమిలో కాంగ్రెస్ పెద్ద దిక్కు కాబట్టి సీట్లు ఇచ్చే పొజిషన్ లో ఉండటంతో కాంగ్రెస్ అహంకారంతో టీడీపీ తో పాటు కోదండరాం పార్టీతో కూడా దురుసుగా ఉంటోంది..దాంతో కోదండరాం సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ కి 48 గంటల్లోగా సీట్ల పంపకం చేయాలని వార్నింగ్ ఇచ్చాడు..అయితే ఈ విషయంలో కాంగ్రెస్ భయపడటం మాట పక్కన పెడితే టీడీపీ మాత్రం ఖంగారు పడిపోయింది కోదండరాం కో ఓ దణ్ణం పెట్టి మరీ బుజ్జగింపు భాద్యతలు నెత్తిన వేసుకుంటోంది.. కూటమిలో ఏ పార్టీ కి కోపం వచ్చినసరే సర్ది చెప్పుకుని కూటమి కూలిపోకుండా చేయాల్సిన భాద్యతని టీడీపీ నే భుజాన వేసుకుంది ఎందుకంటే ఈ కూటమి గనుకా లేకపోతే తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు కి భారీగా గండి పడుతుందనేది చంద్రబాబు భయం , దాంతో కూటమిలో కొట్లాటలు లేకుండా అందరిని సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అంటూ నీతి సూత్రాలు భోదిస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు.