ఎవరి గోడ వారిదే !!

మన ముఖపుస్తకం గోడని శుభ్రం గా ఉంచాలంటే కాస్తంత అందరి గోడులని పక్కన పెడితే “గోడ ..కీ …గోడు.. కూ ” దూరంగా ఉండే అవకాశం ఎక్కువ.అందుకే “ఇతరుల ముఖపుస్తకాల గోడ మీద ఉన్నవన్నీ …       “చూసి నంతనే ..ఎందుకు ? ఏమిటి ?అవసరం ? అనవసరం ? మేలు /కీడు గ్రహించుకుంటే కొంత సమయం వృధా అయినా మనకి మనమే మేలుచేసుకొన్నవారమవుతాము.

ఇంకాస్త సమయం వెచ్చించ గలిగితే “స్వంత మాటలను, ఆలోచనలను”కూడా చేర్చి పంచుకోవచ్చు. అంతే కాక వారి సమాచారం లో ని అక్షర , భాష , వ్యాకరణం దోషాలుంటే అవి మనవంతుగా సవరణలు చేసి సహాయం చేసిన వారమవుతాము.

ఈ విధంగా”ఓ ముఖపుస్తకం గోడ ” కు గొడుగు పట్టినట్లే …

ఎక్కువ సంఖ్యల్లో గుంపులు , పేజీలు ఫాలో అయ్యేవారికి “అభిప్రాయ సేకరణ ” చాలా ఉపయోగం !!

ఇదంతా వ్రాసి పెట్టడానికి గల కారణం ,అన్నిటికీ “అవసరమైన – వ్యాకరణం ” , పదం , శబ్దం , ఉచ్చారణ , మరెన్నో …

మరొక ముఖ్యమైన విషయం ఎవరి గోడ వారికే కదా
ఇతరుల గోడ మీద ఇకనుంచి “మన గోడుని ” పెట్టకుండా ఉండాలంటే …….

నిర్ణయం మీదే!

వ్రాసినది.. దివ్య చేవూరి(లిటిల్ ఎల్మ్ , టెక్సాస్ )