“కూటమి” కోటకి “బీటలు” తప్పవా..కేసీఆర్ “వ్యూహం” ఫలిస్తుందా..?

వాస్తవం ప్రతినిధి:  తెలంగాణాలో ముందస్తు ఎన్నికల హడావిడి రోజు రోజు కి రసవత్తరంగా మారుతోంది ముందస్తు నేపధ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యుహాలని సిద్దం చేసుకుంటూ ఎన్నికలకి సిద్దమయ్యిపోతున్నాయి అయితే కేసీఆర్ ఓటమే లక్ష్యంగా

జతకట్టిన మహాకూటమి టీఆర్ఎస్ వైఫల్యాలని ఎత్తిచూపుతూ ఎలాగైనా సరే తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది అందుకు తగ్గట్టుగా వ్యూహ ప్రతి వ్యుహాలని సిద్దం చేస్తోంది..అంతేకాదు..టీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతి నేతలకి గేలం వేస్తూ తమవైపుకి లాక్కునే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి..

అయితే రాదనుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని ఎంతో నైపుణ్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉద్యమాన్ని ఉదృతం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ సాధించిన కేసీఆర్ వ్యూహాల ముందు ఎన్ని కూటములు వచ్చినా సరే బీటలు వారాల్సిందే అంటున్నారు..ఇప్పటికే కేసీఆర్ పై కూటమిలోని పార్టీలు చేస్తున్న రాజకీయాలని చూస్తూ సహనంతో భరిస్తున్న కేసీఆర్ ఒక్క సారిగా అందరికి బిగ్ షాక్ ఇవ్వనున్నాడట..అంతేకాదు కూటమి తెలంగాణా రాష్ట్రం పొలిమేరలలో కనపడకుండా పోయేలా భారీ స్కెచ్ వేశాడ ట అదేంటంటే..

కేసీఆర్ కి ఎంతో ఇష్టమైన ఆట ఆపరేషన్ ఆకర్ష్..కూటమి చేస్తున్న కుటిల రాజకీయాలకి ఈ ఆకర్ష్ తో చెక్ పెట్టనున్నారట కేసీఆర్ గతంలో కూడా ఆపరేషన్ తో కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలని , తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేతలకి గేలం వేయడంతో వారు ఉన్నపళంగా పార్టీలని విడిచి కేసీఆర్ పంచన చేరిపోయారు అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణాల నేపధ్యంలో కూటమి కట్టిన అన్ని పార్టీలు బలాన్ని పుంజుకున్నాయి దాంతో గెలుపుకోసం కేసీఆర్ కి గతంలో కంటే కొంచం ఎక్కువగానే కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది..

ఈ క్రమంలోనే కేసీఆర్ మహాకూటమి కోటని కొల్లగొట్టడానికి మళ్ళీ ఆపరేష్ ఆకర్ష్ ని తెరపైకి తీసుకువస్తున్నారట. కూటమిలో జతకట్టిన పార్టీలలో ఒక్కో పార్టీ నుంచీ కీలక వ్యక్తులని గులాబీ కండువా కప్పుకోమని పార్టీలోకి ఆహ్వానం పంపుతున్నారట..అయితే ఈ ఆహ్వానం కూడా చోటా లీడర్స్ కి మాత్రం కాదట ఏకంగా పార్టీలో కీలకంగా ఉన్న వారిపైనే ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడుతున్నారని తెలుస్తోంది. ఒక వేళ ఈ ఆకర్ష్ గనుకా సక్సెస్ అయితే కూటమి కూలిపోవడం ఖాయం అనేది కేసీఆర్ వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయం .