“జూ.ఎన్టీఆర్” చేతిలో చంద్రబాబు “జాతకం”..వారెవ్వా “క్యా టైమింగ్ హై”

వాస్తవం ప్రతినిధి: 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ..దేశంలో అనుభవజ్ఞులైన నేతలు అరుదు వారిలో చంద్రబాబు ఒకరు…ఏపీలో ఎటువంటి సంఘటన జరిగినా సరే నా అనుభవం ముందు మీరెంత మీకేం తెలుసు అంటూ చంద్రబాబు ఫైర్ అవుతూ ఉంటారు అయితే గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సప్పోర్ట్ తో అధికారంలోకి ఎక్కిన చంద్రబాబు ఈ సారి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఘలక్ తో తలపట్టుకుని వచ్చే ఎన్నికలకి దారేది అని ఆలోచనలో పడ్డారు…

అయితే ఈ సారి ముక్కోణపు సీరీస్ లో భాగంగా జగన్ ,బాబు ,పవన్ పార్టీల పోరాటంతో ఇప్పటికే చంద్రబాబు కి చుక్కలు కనిపిస్తున్నాయి..అధికారంలోకి వస్తామా..? రామా..? అనే బెంగ బాబు కి బాగా పట్టుకుంది..ఎందుకంటే.. గత ఎన్నికల్లో చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు కాబట్టి మెల్లగా ఎన్టీఆర్ ని సైడేసి పవన్ కళ్యాణ్ ని పూర్తిస్థాయిలో వాడుకుని అధికారంలోకి వచ్చి కనీసం ఎన్టీఆర్ ముఖం కూడా చూడలేదు..దాంతో బాబు కి ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది ఇదే సమయంలో

ప్రత్యక్ష ఎన్నికల్లో కి దూకిన పవన్ కళ్యాణ్ బాబు కి దూరం అవడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి మళ్ళీ సినీ గ్లామర్ కావాలి అందులోని అదికూడా నందమూరి ఫ్యామిలీ నుంచీ ఉండాలి కానీ జూనియర్ తో గతంలోనే అంటీ ముట్టనట్టుగా ఉన్న చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని అడుగుతాడు అయితే ఎన్టీఆర్ తండ్రి చంద్రబాబు బావ హరికృష్ణ చనిపోవడంతో మళ్ళీ జూనియర్ కి దగ్గర అయ్యే అవకాశం చంద్రబాబు కి వచ్చింది..ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు మెల్లగా జూనియర్ కి దగ్గరయ్యారు..

ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో కూడా ఇదే ఆసక్తికరమైన విషయంగా మారోపోయింది.. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్ళీ చేరదీసి టీడీపీ కి అనుకూలంగా ప్రచారం చేయించే అవకాశం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది…జూనియర్ ప్రచారం చేయడు అనుకోవడానికి కూడా ఇక్కడ మార్గం లేదు ఎందుకంటే..తన కట్టే కాలే వరకూ కూడా తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాడు..అంతేకాదు జూనియర్ వస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతాయి..

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నందమూరి అభిమానులు టీడీపీ కి దూరంగా ఉంటున్నారు. జూనియర్ రాకతో వారంతా టీడీపీ కి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ఆయన సినీ అభిమానులు కూడా కలిసివస్తారని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చని టీడీపీ అధినేత ఆలోచన. ఒకవేళ జూనియర్ ని దూరం చేసుకుంటే ఆ స్థాయిలో ఓటర్లను ప్రభావం చేసే శక్తి టీడీపీ లో ఎవరికీ లేదు. ఇక లోకేష్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఆయన వల్ల టీడీపీ కి నష్టమే తప్ప లాభం లేదు అనే సంగతి బాబు కి కూడా తెలుసు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని చేరదీసి బాబు చక్రం తిప్పే ఛాన్స్ కనిపిస్తోంది..కానీ చంద్రబాబు ఈ సమయంలో జూనియర్ చెంతకి చేరడం తో చంద్రబాబు జుట్టు ఎన్టీఆర్ చేతిలో పెట్టినట్లే అంటున్నారు విశ్లేషకులు..