కవీశ్వరుడు!

నేడు ( ఆగస్టు 29) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. 

కవి హృదయం ఓ విశాలవిశ్వం
కవికలం ఓ కథనుద్రొక్కే సైన్యం
కాదు కవి స్వార్ధపరుడు
కాదు ఆస్తికుడు, నాస్తికుడు
కాదు రాచబిడ్డడు
కాదు కాదు సామాన్యుడు
అంతెందుకు ఏమీకాడు!
కానీ…
అతడు హృదయమున్న వాడు
భువిపై చీమ చిటుక్కుమన్నా స్పందించువాడు
వసుధైక కుటుంబీకుడు
విశ్వమానవుడు ఈ కవీశ్వరుడు
అందుకే కవిహృదయం… ఓ విశాల విశ్వం…
కాదు పిరికిపందడు
కాదు ఆయుధ ధారుడు
కాదు త్రిశంకువిహారుడు

కాదు అవాస్తవికుడు
అంతెందుకు ఏమీ కాడు!
కానీ…
అతడు వాస్తవికుడు
సమాజంలో చెడు ప్రవేశించకుండా కాపుకాచే సైనికుడు
సమాజ రుగ్మతలకు వైద్యుడు
కలం చేపట్టిన వజ్రాయుధుడు
ఆత్మసాక్షిగా నడిచే ధీరుడు
అందుకే కవికలం ఓ కథనుద్రొక్కే సైన్యం
అంతెందుకు,
తన గురించి తాను ఆలోచించని నిస్వార్దుడు
ఈ విశ్వ చైతన్య వెలుగులకు ఈశ్వరుడు ఈ కవీశ్వరుడు!

అందుకే! వందన మర్పిస్తున్నా..
త్రిసంధ్యలలో
మాతాపితరులకు
నా కవి కుటుంబీకులకు!
ఆదిగా అక్షరాన్ని సృష్టించిన
కవి బ్రహ్మకు మాతృవందనం!
మలిగా అక్షరాన్ని పోషించిన
కవిశ్రేష్టులకు పితృవందనం!
అనుక్షణం అక్షరాన్ని రక్షిస్తున్న
నేటి కవులకు నిత్య వందనం!!
రచన…. శ్రీ లీలా విరాట్..
(నెల్లూరు  – ph: 9491304391 )