పవన్ “గొంతుకలు” గా ఆ రెండు “మైకులు”

వాస్తవం ప్రతినిధి: పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు నుంచి అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని అనుకునే ప్రతీ ఒక్కరికీ పవన్ స్పూర్తివంతమైన ఉద్వేగభరితమైన మాటలు..దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా అరిచి చెప్పే నినాదాలు గుర్తుకు వస్తాయి..తన స్పీచ్ లతో యువతలో వెయ్యి ఓల్టుల విద్యుత్ ప్రవహించేలా చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు ఏపీలో ఒకేఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ వాస్తవాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే అయితే..అయితే పవన్ కళ్యాణ్ గుంటూరు వేదికగా ఎప్పుడైతే చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు చేస్తూ కాలు దువ్వాడో అప్పటినుంచీ చంద్రబాబు కి పవన్ టార్గెట్ అయ్యాడు..
పవన్ కళ్యాణ్ గొంతుని పవన్ కళ్యాణ్ ని మీడియా ముందు చూపించకుండా చేస్తే తప్పకుండా తన ప్రభావం తగ్గుతుంది అనుకుని కుటిల ప్రయత్నాలు చేసి మీడియా ని దూరం చేశారు..ఈ క్రమంలోనే పవన్ సైతం మీడియా ని బ్యాన్ చేయండి అంటూ ఛానల్స్ పై మాటల దాడి చేశారు .అయితే ఆరోజు మొదలు మీడియా ఛానెల్స్ చాలా వరకూ పవన్ పై కూడా బ్యాన్ విధించాయి. పవన్ వార్తల హడావిడి మీడియా ఛానల్స్ లో చాల తక్కువగా కనిపించడంతో పాటుగా పవన్ ప్రసంగాల కవరేజ్ కూడా అసలు ఎక్కడా కనపడకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు..
అయితే ఎంతో పక్కా ప్లాన్డ్ గా పవన్ పై చేస్తున్న ఈ దాడిని పరిశీలిస్తున్న పవన్ ఎప్పటినుంచో ఈ కుట్రలకి చెక్ పెట్టాలని భావిస్తున్నాడు అందులో బాగంగానే తనకి కూడా ఒక సొంత ఛానెల్ ఉంటే ప్రజలకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రభుత్వాలని ఎటువంటి విషయాలలో ఎండగడుతున్నాం అనే విషయాలు స్పష్టంగా తెలియచెప్పచ్చు అని పవన్ భావించాడు…ఈ నేపధ్యంలో తన పై జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీకి అడ్డుకట్ట వేయడానికి పవన్ వేసిన ప్లాన్ కి దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది కొంతమంది మీడియా అధిపతులకి..ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పవన్ ఒకే సారి రెండు మీడియా ఛానల్స్ ని తన ఆధీనంలోకి తీసుకోబోతున్నాడు..ఈ వార్త టీడీపీ లోమరియు పవన్ ని టార్గెట్ చేస్తున్న మీడియా అధిపతులకి దిమ్మతిరిగేలా చేసింది.. అయితే తాజా సమాచారం ప్రకారం 99టివి ఛానల్ ను భారీ మొత్తానికి పవన్ కు అత్యంత సన్నిహితుడైన తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని తెలుస్తోంది..ఇదిలాఉంటే 10 టివి లోని మేజర్ షేర్స్ ను మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేశారని తెలుస్తోంది . అయితే నిమ్మగడ్డ ప్రసాద్ తో చిరు కావాలని ఆ షేర్స్ కొనుగోలు చేయించారని టాక్ కూడా వినిపిస్తోంది..అయితే త్వరలోనే ఈ రెండు ఛానెల్స్ పవన్ గుండె ఘోషకి గొంతుకలు కానున్నాయి అని సమాచారం అందుతోంది..