“అన్నా క్యాంటిన్లు”… దోచుకోండి తమ్ముళ్ళు

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత “అమ్మ క్యాంటిన్లు” పెట్టి తమిళ నాట పేద ప్రజల ఆకలి తీర్చి ప్రజలకి ఎలా చేరువ అయ్యిందో అదే తరహాలో ఏపీలో కూడా ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటిన్లు పెట్టి ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలని బాబు భారీ స్కెచ్ వేశారు…అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడిచి ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని అనుకున్న తరుణంలో ఈ క్యాంటిన్లు ఓట్లకోసం వేస్తున్న గేలం అని అందరికీ తెలిసిందే . అయితే ఈ క్యాంటిన్లు ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీర్చుతున్నాం అని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వాలు అన్నగారి క్యాంటిన్లు పేరుతో తమ్ముళ్ళకి అడ్డంగా దోచి పెతుడుతున్నాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు ప్లేటుకి 5 రూపాయల అని చెప్పి కాంట్రాక్టర్స్ కు మాత్రం ప్లేట్ కు 73 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి..మరి ఆ కాంట్రాకర్స్ ఎవరో కాదు బాబు క్యాబినెట్ లో టీడీపీ మంత్రే అంటూ కధనాలు రావడం ఇప్పుడు అందరిని విస్మయానికి గురిచేస్తోంది..అన్నగారి క్యాంటిన్లని సైతం వదలడం లేదా అంటూ టీడీపీ పై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి..అయితే మొదట్లో ఇస్కాన్, స్వచ్ఛంద సంస్థలు వస్తే 15 రూపాయలకే చేస్తామని ముందుకు వస్తే వారిని కాదని ఇప్పుడు 73 రూపాయలకి తమ్ముళ్ళకి దోచి పెట్టడం వెనుక భారీ స్కాము ఉందని అంటున్నారు..
అసలు ఒక్కో క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కోటి రూపాయల మొత్తం వరకూ ఖర్చు పెడుతున్నారట…అసలు కోటి రూపాయలు ఉంటే ఒక స్టార్ హోటల్ ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపేయచ్చు కానీ ఇంత మొత్తంలో డబ్బులు పేదవాడి కడుపు నింపడానికి పెడుతున్నారు అంటే చంద్రబాబు ప్రభుత్వం అన్నక్యాంటీన్ పేరు చెప్పి ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో అర్థం చేసుకోవచ్చు..ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ,లోకేష్ లపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే..తాజాగా ఈ అన్నా క్యాంటీన్ ల వ్యవహారం బాబు కి కొత్త తలనెప్పులు తెచ్చి పెడుతోంది అంటున్నారు..

అసలు అన్నా క్యాంటీన్ లని ఏర్పాటు చేసింది పేద ప్రజల ఆకలి తీర్చడానికా లేక ప్రజలు ఇచ్చే డబ్బుని కొల్లగొట్టి తమ్ముళ్ళకి దోచి పెట్టడానికా అనే విమర్శలు చంద్రబాబు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి..నిర్వహణ మొదలు ఈ క్యాంటీన్ ల వ్యవహారం అంతా అవినీతి మయంగా ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఎక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినా అక్కడి ఎమ్మెల్యేలు మొదలు మంత్రులు వరకూ వారి కనుసన్నల్లోనే ఉంటోందని, అన్నా క్యాంటీన్ లు పేదవాడి కడుపు నింపడం కోసం కాదు తమ్ముళ్ళ జేబులు నింపడానికి పనికొస్తున్నాయి అంటున్నారు విమర్శకులు..