జనసేన లోకి జేడీ ఎంట్రీ ఖరారు..? త్వరలో

వాస్తవం ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయా..? అసలు నిర్మాణమే సరిగాలేదని పార్టీలో సభ్యులే లేరు అంటూ పవన్ పై వస్తున్న కామెంట్స్ కి కీలక నేతల చేరికతో చెక్ పడనుందా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు..ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర కి అన్యాయం జరుగుతోంది అంటూ పర్యటనలతో ప్రజలలో తనదైన శైలిలో ఆదరణ పొందుతున్నాడు..గతంలోనే ఫ్లోరైడ్ భాదితుల కోసం పవన్ ప్రభుత్వాన్ని కదిలించిన సంఘటన అందరికీ తెలిసిందే అయితే అదే సమయంలో ఉత్తరాంధ్ర పై అధికార పార్టీ దోపిడీ ని చొక్కా పట్టుకుని లాగి మరీ అడుగుతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ..ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో చేరువ అయ్యాడు..

అంతేకాదు ప్రత్యేక వాదం అంటూ తెరపైకి కొత్త నినాదం ఎత్తుకుంటూ అధికార పార్టీకి చుక్కలు చూపించాడు అయితే ఎన్ని చేసినా పవన్ ఒక్కడే వన్ మెన్ షో చేస్తున్నాడనే విమర్శలు పవన్ పార్టీలో పవన్ తప్ప గెలుపు గుర్రం ఒక్కటికూడా కనపడంతం లేదు అంటూ వచ్చే కామెంట్స్ కి ఇప్పటి వరకూ సరైన సమాధానం చెప్పలేక పోయాడు దానికి కారణం గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం కానీ తానూ 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తానని చెప్పిన స్థానాలలో అభ్యర్ధులు లేకపోవడమే..అయితే రెండు రోజుల క్రితం జరిగిన చిరు ఫ్యాన్స్ జనసేన చేరికతో గ్రామస్థాయి నిర్మాణం మీద కొంతమీర నష్టం నుంచీ బయట పడినట్టే..

అయితే త్వరలో చిరంజీవి నాగబాబు పార్టీలో చేరుతారు అంటూ వచ్చిన వ్యాఖ్యలకి జనసేన పార్టీలో కొత్త ఊపుని తీసుకువస్తే ఇప్పుడు మరొక నేత పార్టీలో చేరుతారు అంటూ వస్తున్న వార్తలకి జనసేన కార్యకర్తలు.పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేధావులు సైతం ఇది సరైన ఆ నేత చేరిక సరైన నిర్ణయమని సమర్ధిస్తున్నారు..ఇంతకీ ఆ నేత ఎవరో కాదు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ..తన పదవికి స్వచ్చందంగా విరమణ ప్రకటించి ప్రజా సేవలో తరించాలని రైతుల సమయలపై సమర శంఖం పూరించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై పర్యటనలు చేస్తున్నారు.

ఎంతో మంది రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతూ వారి సమస్యలని తెలుసుకుంటున్న జేడీ తన రాజకీయ రంగప్రవేశం గురించి అడిగిన ప్రతీ సారి మాట దాటవేస్తూ వచ్చారు అయితే తాజాగా కర్నూలు పర్యటనలో ఉన్న జేడీ ఉపాది హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జేడీ తన పొలిటికల్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకొంటున్నాని…ప్రజా సమస్యలు తీర్చే పార్టీకే తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు అంతేకాదు..ఏ రాజకీయ పార్టీలో చేరాలనే విషయంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని జేడీ అన్నారు..

అయితే జేడీ ప్రస్తుతం చేస్తున్న రైతు యాత్రలలో ఎన్నో సమస్యలని ఖండిస్తూ వచ్చారు ప్రభుత్వంపై విమర్శలు సైతం ఎక్కుపెడుతూ వచ్చారు దాంతో అందరూ తెలుగుదేశంలో కి వెళ్ళే ప్రశక్తి లేదని అయినా తెలుగుదేశంపై ఇప్పటికే తనకి అందిన సమాచారం మేరకు ఏపీలో పూర్తి వ్యతిరేకత ఉందని అందుకే ఆపార్టీలోకి వెళ్ళే సాహసం చేయరని అంటున్నారు…ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ అక్రమ ఆస్తుల కేసులు మొత్త బయటకి తీసి ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్ళేలా చేసిన జేడీ ఆ పార్టీలోకి వెళ్తారని ఎవరూ అనుకోవడం లేదు ఇక బిజేపీ విషయంలో ఏపీలో ప్రజలు బిజేపీ పై పూర్తీ స్థాయి వ్యతిరేకతతో ఉన్నారు అందుకు తగ్గట్టుగానే బిజేపీ నేతలు రోడ్ షో లు చేస్తుంటే చెప్పులతో దాడి చేస్తున్నారు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీలోకి జేడీ అస్సలు వెళ్ళే అవకాశమే లేదు దాంతో ఇప్పటి వరకూ చాలా క్లీన్ గా ఉన్న పార్టీ జనసేన ఒక్కటే అందుకే జేడీ జనసేన వైపు చూస్తున్నారని త్వరలో జనసేనలో కీలక పదవి చేరి కీలక పదవి చేపట్టబోతున్నారని తెలుస్తోంది..ఇక జేడీ లాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జనసేన లో చెరితే పార్టీ కి మైలేజ్ రావడమే కాకుండా జనసేన ఎంతో బలమైన పార్టీగా మారుతుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.