సీఎం గోరికి ఏటైంది..?  

వాస్తవం ప్రతినిధి:  ఉభయగోదావరి జిల్లాలు.. ఉత్తరాంధ్ర యాసలో రాస్తున్నందుకు.. మీరు కాస్తంత ఓపిక తెచ్చుకోవాలి మరి.. కాస్త నొప్పి వచ్చినా.. కొంచెం ఇబ్బందైనా సత్యం సత్యమేగా..? జీర్ణించుకుంటే.. విషం కూడా అమృతమే. జీర్ణించుకోలేకపోతే.. అమృతం కూడా విషమే.
ధన్యవాదాలు..
సీఎం గోరికి ఏటైంది..? అసలు ఆయనేటి ఇలాగైపోండు..? సూత్తుంటే.. కాత్తంత గాబరా.. ఒక రవ్వ ఎర్రేమన్నా ఉందాని.. అనిపిత్తాందేటి..? ఒకపాలి బోయపాటిని పిలుత్తాడు.. ఎంటనే రాజమౌళి అనేత్తాడు..! ఒక సుట్టు పిల్లల్ని కనొద్దంతాడు.. ఆ ఎంటనే.. మళ్లీ ఎక్కువగా పిల్లల్ని కనీమంటాడు..! నోబెల్ ఇత్తానంటాడు.. రోడ్లేశాం ఓట్లేయకపోతే.. వల్లకోమని సెప్తాడు.. అసలేటైంది..? సీఎం గారికి ఏమొచ్చింది..! సింహొం లాటి మడిసి ఒక్కసారి ఇట్టాగైపోయాడేటి..? కొంపదీసి ఆయనకేటైనా.. అయిపోయిందేటి..? వయసైపోయి.. ఏదేదో కూత్తన్నాడా.. ఏటి..? అయ్ బాబోయ్ అట్టాగైతే తెలుగుదేసం పార్టీ గతేటి..? ఇడిపోయిన రాట్రం సంగతేటి..! వామ్మో ఇదేదో సిత్రంగా ఉందేట్రోయ్..! ఒకపాలి ఈ నాలుగేళ్ల బాబుగోరి యవ్వారం సూసేద్దామ్ పదండైస్..

సంద్రంలాటి “నాయుడు” సినుకైపోండు..! నారా సంద్రబాబు నాయుడు. ఇరిగిపోని రాట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిసేసి.. సెభాశ్ అనిపించేసుకున్న పొలిటీసియనూ.! ఇయాల.. ఇడిపోయి పాడైపోయిన రాట్రానికి సరైనోడని.. ఆంధ్రోళ్లంతా కలిసి కిందటి ఎలచ్చన్ లో సెలచ్చన్ సేసి మరీ సీఎంని సేసిన ” పెద్ద”బాబు” గోరు ఆయన. అలోటి పెద్దాయన.. కొన్ని దినాల సంది మాసెడ్డ మాటలాడేత్తాన్డు. సెప్పే కబుర్లకి.. సేసే పనులకు అస్సొలు పోలికుండట్నేదు. ఆ ఊరంట.. ఈ వాడంట దిమ్మర్లా తిరుగుతుండేమో.. అస్సలు బుర్రకెక్కని కబుర్లన్నీ మాట్లాడుతాండు. కోడికూసినప్పటి మాట పొద్దుకింకినంక ఉండట్నేదు. సీకటి పడినాక సెప్పిన ఇసయం తెల్లారికుండట్నేదు. ఇదేటయ్యా.. అంతే అదేమరీ.. అడగొద్దంతారు బాబుగారి మంది. హాట్.. ఆయనేటి ఆయనగోరి మీరు సెప్పేదేటి అంటూ కసిరేత్తన్నారు. దగ్గరికెళ్లి సప్పేటోళ్లు లేక.. సెప్పే ఆ కొంతమందికి ఇషయం లేక బాబుగోరికి మా సెడ్డ కట్టమే వచ్చిపడిపోయింది కదేటి.

అదేటో.. అలా అనేత్తారంతే..! బాబుగోరన్న మాటలింటే నవ్వుతా ఉన్నరు కొందరు. తిట్టుకుంటా సికాగ్గా మొగం తిప్పేత్తాన్న కొన్ని ఊళ్లోరు..! ఇంకొందరు ఎబ్బే అనుకుంటా పెదాలొగ్గేత్తా పిచ్చైపోతాన్నరు. 1990 కాడ్నించి.. 2002 దాకా అప్పటి ముక్యమంత్రిగా పనిసేసిన బాబేనా ఇయ్యాల ఈ కాకమ్మ కధలు సెబుతాంది అనుకుంటూ ఎర్రైపోతన్నారు. తెలంగాన, ఆంధ్ర కలిసున్న కాలంలో ఆయన సేసిన పనులు సూసి.. పక్క దేశాలు ముక్కున ఏలెట్టుకున్నై. ఇదేశాల నుంచీ తెలుగు రాట్రాలకు బిల్ క్లింటను, బుష్ లాంటోల్ని ఆహ్వానించి.. ఇక్కడికి రప్పించి.. ఆహా.. ఓహో అనిపించుకున్న బాబుగారేనా ఈయన అని నోళ్లెళ్లబెడతాన్రు. పదేళ్లలో కలిసున్న ఆంధ్రప్రదేశ్ ని అక్కడెక్కడో ఎట్టేసి.. జై నాయుడు గారు అనిపించుకున్న సంద్రుడేనా.. ఇలా తిక్కలేసినట్టు కూత్తున్నది అంటూ తెగ ఇదైపోతాన్నరు జనం. ఉదయం లేసిన కాడి నుంచీ రేతిరి దాకా.. విజన్ విజన్ అంటూ రాట్రాన్ని అల్లంత దూరం ఆకోశానికి ఎత్తేసిన “బాబు” గారు ఈయనేనా అని తెగ డౌట్ పడిపోతా ఉన్నరు జనాలు. ఏటైస్.. ఈ సొల్లు అని అందరూ సివాట్లెట్టుకుని.. బుర్రలొట్టుకుంటే.. అయ్యో అని పిచ్చిపచ్చినోళ్లలా తిరుగుతాన్రు బాబుగోరి అనుంగు అనుచరులు. కానీ ఏటి సేత్తాం.. కర్మకాలిపోతే ఈలాటి దినాలు కూడా సూడాలి కదేటి.. అంటూ తలలు పీక్కుంటూ.. బైటికి మాత్రం సెకాలి నవ్వులు నవ్వేత్తా పోతాన్నరు. బాబ్బాబు.. అలాగైపోకండి..! ఒకపాలి టెక్కునాలజి కనిపెట్టేనంతాడు. అదేటయ్యా అంటే హైద్రాబోదు అభివృద్ధి సేశానంటాడు. ఇంకోసారి నాదేళ్ల సత్యకు ట్రైనింగ్ ఇచ్చానంటాడు బాబుగోరు. బాబుగోరండీ.. నిజంగానే మీరే ఇయన్నీ సేశారు.. అలాగే మీ పెబుత్వంలోనే కదంటి కరువుకాటకాలు ఉండింది.. అంటూ పక్కమాటలాడే నాయాళ్లతో బాబుగోరికి తెగ కోపొమొచ్చీసింది. ఠాత్.. నన్నెందుకు అన్నారంటూ.. ఆళ్ల మీద కారాలు మిరియాలు నూరేన్రు. ఇంకోపాలి.. రాట్రలో యువకులు తగ్గిపోయినారు..దండిగా పిల్లల్ని కనేయమని సానా వీజీగా చెప్పేశారు. అదేటండీ.. ఉన్న కుర్రకుంకలకే జాబులు లేక ఏడుత్తాంటే.. ఇంకా పిల్లల్ని కనేసి.. ఆళ్లకేటి దారి సూపెట్టమంతారని ఒక ఎర్రిమాలోకం గాడు అడిగేశాడు. ఏం కూశావ్రా అంటూ ఆ ఎర్రి “సత్తయ్య” మీద రంకెలేసేన్రు పచ్చ సొక్కావోళ్లు. ఒళ్లు హూనమయ్యే కాడికి సావగొట్టేసి ఇంటికి అంపించేనారు. మరోసుట్టు.. పెసల్ స్టేటస్ కోసం తెగ మాటలాడేసి.. సెంటరోళ్లు ప్రత్యేక పేకేజీ అనేయ్ గానే ఎంటనే రూటు రివర్సేశాన్రు బాబు.. ఇదేటి సామీ అంటే “ఓయ్.. అప్పలోళ్లారా.. రాట్రం ఇసయం నాకు ఎరుకా.. మీకా.. అంటూ సిందులేశేన్రు అన్ని పార్టీలు.. ప్రజా సంగోల మీద. ఈ పెంకితనం అంతా సతికిలబడిపోయినాక.. మళ్లీ సెంటరోళ్లను కెలికేండు బాబు. ఆ మద్య నోట్లు సెల్లవంటూ పెదాన మంత్రిగోరు ఆర్డరేసినంక.. సారు మెల్లిగా కూతలట్టాడు. నోట్లు రద్దు సేయమని ఆయనే సేప్పానని.. నోట్లు రద్దు జరుగుతున్న కబురు తనకు ఎరుకేనని సావు కబురు సల్లగా సేప్పేశాడు. అదేటి ఈ ఇసయం తెలిత్తే ముందే సెప్పాలా.. వద్దా అంటాన్రు పెతిపచ్చాలు. ఇందులో పెద్ద సిక్కే ఉందంటూ గోలెట్టేశారు. బాబుగోరి బ్లాక్ మనీ అంతా వైట్ సేసేసుకుని.. తేలిపొట్టు కుట్టిన దొంగలా ఉండిపోనాడాలని నోళ్లేసుకు పడిపోయారు. ఇదంతా ఇన్న బాబుగోరు పెద్దగా పట్టించుకోనేదు. ఇదేటి ఈ ఇసయంలో ఎందుకట్టా ఉండిపోనరు.. అంటే.. ఏటైనా అరిత్తే అసలు ఇసయాలు బయటికొత్తాయి గదేటి.. అంటూ బాబుగోరి తాలుకోళ్లు చెవులు కొరుక్కున్న బాగోతం అక్కడక్కడా ఇనిపించేది లెండి.?

కొత్త కూతలతో.. ఆంధ్రోళ్లకు గుబులు..

ఈ నడేన్నే.. బాబుగోరు.. గట్టి బాంబులు వదిలేసేన్రు. బోయపాటి.. రాజమౌళి అంటూ పలవరిత్తాన్నారు. ఇదేటిది.. బాబుగారికి సినిమా జొరం వచ్చిందనుకునేరు. లేద్లేదు.! అదొక మాస్ హిస్టీరియా..! బాబుగోరు.. మొదట్నుంచీ.. అటుపక్కే పెరిగేరు కదేటి. అందుకే.. ఆయన దర్శకులు.. సినిమావోళ్లకి అంత వేల్యూ ఇత్తాన్నది. అయినా.. ఇదేటి బోయపాటి.. రాజమౌళి అంటే ఉలుకేటి అంటారేటి..? అదేట్నేదండి.. రాట్రం ఇడిపోయినాక ఆంధ్రోల్ల మడసులు మడసుల్లో లేవు. ఎవుర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెనియట్నేదు. అందుకే అలా మాటు తూలేసినాము. అయినా.. బాబుగారి కంటే గొప్పగా ఎవరు ఉద్దరిత్తారు మనల్ని.. మనోళ్లనీ..? అయితే ఈ ఎర్రిబుర్రకి సిక్కని.. పాలుపోని ఇసయం ఉందోటి..! అదే అర్ధం కాక తెగ ఇదైపోతున్నం అంటూ ఆంధ్రోళ్ల సోశల్ మీడియా.. ఈ మయాన తెగ ఇదైపోతన్నాది. అరెరే.. గోదారి పుస్కరాలకు బోయపాటి ఆర్గనైజింగూ.. అమరావతి కట్టడానికి రాజమౌళి డైరక్టింగూ… ఏంటని సెడ్డ సికాకు పెశ్న బుర్రల్ని తొలిసేత్తంది..? ఈటికి బాబుగోరు బదులిత్తారా..? వాకే.. ఆయనగాకుంటే.. ఇంకెవల్లెయినా.. ఇసయం ఇడమరిచి సెబుతారా.. అనేది వందాకుల పెశ్న. అయినా.. ఇయన్నీ.. బాబుగోరికి కొత్తేటి ఎంటనే సమాధానం సెప్పేతారు కదేటి..!

డైరెక్టొర్లు.. సూపరో.. సూపరు..!

అప్పటి నుంచి సూత్తన్నాం.. ఎక్కడ సూసినా.. ఏం సేసినా.. ఎక్కడైనా.. రాజమౌళి. అంటన్నారు.. ఎంత బాహుబలి డైరెట్టరు అయితే మాత్రం ఆయనకు అంత ఇదేటి అనుకున్నాం బావులు..! కానీ అదేటో.. సీఎం సంద్రబాబు కూడా అదే పేరు సెప్పేత్తుంటే.. మాత్రం మాకూ అదే సిత్రంగున్నాది. అప్పుడెప్పుడే మా ఉత్తరోంధ్రోళ్లు గోదార్లో పుస్కరాలకు ఎల్లిపోనారు. అప్పటికాడ్నించి.. ఆల్ల నవ్వులు సూడనేదు మాయూరోళ్లు. ఎందుకంటే అప్పటి గాబరా తొనుగుడులో మా ఉత్తరోంధ్రోళ్ల సగం పైన సచ్చిపోయారు. కానీ ఇదేటి పెద్దిసయం కాదన్నట్టు.. ఓ డైరక్టురుగారి సూటింగ్ కోసం మావోళ్లు సనిపోనారని తెలిసినెంటనే ఎర్రెత్తుకొచ్చింది. కానీ.. ఏటి సేత్తాం.. అప్పటికే పదిలచ్చలు.. పెతి శరీరానికి ఇచ్చేసిండు బాబుగోరు. అందుకే డైరెట్టరు గేటే మరి.. ఇప్పుడు అదే సినిమా డైరెట్టరు మొత్తం రాట్రానికి రోజధాని కట్టిత్తారంటే.. సహకరించమేటి..? కానీ.. బాబుగోరూ.. ఆ మొత్తం డైరక్సను మాత్రం.. ఇంజనీర్లతో సేయించండి..! నేకపోతే.. మొత్తం బాహుబలి సెట్టునాగా.. మొత్తం అంతా కూలిపోయి.. మన రోజధాని.. కుక్కలు సింపిన ఇత్తరైపోద్ది. అందుకే.. సెప్పుతున్నాం కాత్తంత జాగ్రొత్తగా రాట్రాన్ని కట్టండి..! కొసమెరుపేటంటే… సీఎం గోరు రాజధాని కోసం తెగ ఇదైపోతన్నారు సరే. కానీ ఇప్పుడు జనాల ఎదల్ని తొలిసేత్తున్న పెశ్నలకు సమాదానాలు కావాల్గదేటి. ఏటి సేత్తాం…. అని వల్లకోడానికి రాట్రం ఒకరి సొత్తు కాదాయె.

ఇంతకీ సెప్పొచ్చీదేటంటే.. గోదారి పుచ్చరాలకి బోయపాటి.. రాజధానికి రాజమౌళి అంటూ కొంగజపం సేత్తున్న సీఎం గారు.. రేపో మాపో మాస్ ఓట్లకు పూరీ జగొన్నాధ్ ని.. పోలవరం ప్రాజెక్ట్ కి వివి వినాయక్ ను గానీ పెట్టేత్తారేటో.. అని మా సెడ్డ గాబరా గుంది మా ఆంధ్రోళ్లకి. ఏమో.. అది జరగ్గాలేనిది.. ఇది జరగదేటి.? ఏటో.. ఆ కాంగిరేసోల్లను వగ్గీసి.. బాబుగోర్ని నమ్మకుంటే.. ఆయనేటి మనల్ని ముంచేత్తాడా.. అంటూ ఆంధ్ర తెలుగోళ్లు తెగ మదనపడిపోతాఉన్నారు. కొంపదీసి.. మేం గాబరా పడ్డట్టే సేసినారంటే.. అయ్యోరు..! మీకేటి పక్క రాట్రంలో సక్కా.. వందకోట్ల కొంపలో కాపురం ఉంటారు. ఎటుతిరిగీ.. మళ్లీ సీమాంధ్రోళ్లే మళ్లీ ఎర్రినాగన్నలై కూకుంతారు..! బాబ్బాబు.. ఈసారి మాత్రం అట్టా సేయకండయ్యో.. మీకు ఏల ఏల దండాలెడతాం బాబయ్యో..! ఉంటాం..

బాబుగోరు.. ఇట్లు సీమాంధ్ర జెనం..!

నా
కలం పేరు
“నందు” ————————