శుభోదయం !

గురువారం శుభోదయం
హమ్మయ్యా జనవరి అయిపోయింది ..నా పని మొదలయింది ..ఓ జనవరి వెళ్తూ నా ఆలోచనలను తీసుకెళ్ళొచ్చు కదా !!
అందుకే ఫిబ్రవరి వచ్చింది ఈ రోజు .మంచి మనసులు , మంచి పనులకు , మంచి మంచి నడవడికలూ ,బోలెడన్ని మన పండుగలు , ఆనవాయితీ లేకున్నా ఉన్న తీరు వాతావరణం బట్టి పాటించాల్సిందే కొన్ని పండుగలు !!
ఆ తీరులో ఒకటి ” వ్యాలెంటైన్స్ డే “.”ప్రేమికుల రోజు “.
రోజు లన్నీ ఒకలా ఉండవు ,పూటలన్నీ ఒక పుటగా మారవు, మాసముల్లో అధికమాసమే,సమయము లో సంవత్సరాలు మారినా మన అందరి మీద మన “అమ్మ నాన్నల “ప్రేమ నిత్యం రెట్టింపే ఆ ప్రేమను ప్రేమతో మన కుటుంబానికి పంచితే ప్రతిదినం శుభదినం !!

నన్ను చూసి నువ్వేమి నేర్చుకున్నావు ?నా వల్ల ఎంత మంచి జరిగింది ? కొత్త విషయాలు ఇంట , బయట , విశ్వం లో ఏమి తెలుసుకున్నావు ? నేనేంత ఆనందం , ప్రేమ గా ఉన్నానా ….అనేదే నా సోధన ..సాధన..

మెప్పించుటకు కాదు
నొప్పించుటకు కాదు
కోపించుటకు కాదు
పేరుప్రతిష్టలకు కాదు
బిరుదులకు కాదు
ఆనందంగా అందరమూ బాగుండుట కోసమే 🙏🙏🙏🙏
వ్రాసినది ..దివ్య చేవూరి , లిటిల్ ఎల్మ్ , టెక్సాస్ !!