Monday 21st of May 2012
A not-for-profit, un-biased news channel with No-Caste, No-Religion and No-Region






Be an iReporter to vastavam.net, post realistic text/video incidents and news in your area. Contact editor@vastavam.net
news menu leftnews menu right

User Login



ప్రసంగాల్లేవు..ఇంటింటి ప్రచారమే:జగన్
Monday, 21 May 2012 18:39

 

ఒంగోలు, మే 21,(వాస్తవం):    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ప్రచారం నిర్వహించారు.ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరంభమైన రోడ్ షో నగరంలోని గాంధీనగర్,పాపాకాలనీ,బిలాల్ నగర్,నెహ్రూ నగర్,ఇస్లాంపేట,కరుణకాలనీ,ఎంటీ ఆర్ కాలనీ,పొనుగుపాటి కాలనీ,బలరాం కాలనీ, కేశవరాజుకుంట కాలనీల్లో సాగింది.కొన్ని కాలనిల్లో కాలి నడకన జగన్ మహిళలతో  మాట్లాడారు.భోజన విరామం అనంతరం రోడ్ షో కొనసాగించారు.

రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఒక్కచోటా ప్రసంగించలేదు.నగరంలోని శివారు కాలనీ అయిన కేశవరాజుకుంట దగ్గర రెండు రోజుల పర్యటన ముగించిన జగన్ గుంటూరు జిల్లా మాచర్ల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

 
నాలుగైదు రోజుల్లో ఇసుక వ్యవహరం కొలిక్కి:సీఎం
Monday, 21 May 2012 18:22

 

మాచర్ల, మే 21,(వాస్తవం):  ఇసుక  వ్యవహరం ప్రస్తుతం కోర్టులో ఉందని..నాలుగైదు రోజుల్లో కొలిక్కి వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మాచర్ల వచ్చిన ఆయన రాత్రికి అక్కడే బసచేసిన సీఎం ఆదివారం ఉదయం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద సీఎం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను కార్యకర్తలు ప్రజలు ముందుకు తీసుకెళ్లి విజయానికి కృషిచేయాలన్నారు.

మాచర్ల,ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరులో శీతల గోదాముల్లో అగ్నికి అహుతై నష్టపోయిన మిర్చి రైతులు సీఎం ను కలిసినప్పుడు ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ఎలాంటి హమీ ఇవ్వలేనని,అనంతరం న్యాయం చేస్తానన్నారు.కాస్త ఆలస్యంగా ఎగిరిన హెలికాప్టర్ కేసీపీ మైదానంలో ఏర్పాటు  చేసిన హెలిప్యాడ్ వద్ద నుంచి హెలికాప్టర్ గాలిలోకి ఎగరడానికి కొంత సమయం తీసుకోవడంతో నాయకులు కొంత ఆందోళనకు గురయ్యారు.హెలికాప్టర్ గాలిలోకి  ఎగరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 
త్వరలో ఆంధ్రా రాజకీయాల్లోకి:జయప్రద
Monday, 21 May 2012 17:31

 

పాలకొల్లు, మే 21,(వాస్తవం): ఆంధ్రా  రాజకీయాల్లో త్వరలో ప్రత్యక్షంగా పాల్గొంటానని,అన్ని పార్టీలు తనను ఆహ్వనిస్తున్నాయని,ఏ  పార్టీలో చేరేది ఇప్పుడే చెప్పలేనని సమాజ్ వాది పార్టీ ఎంపీ జయప్రద వెల్లడించారు.పాలకొల్లు లలిత కళాంజలి నాటకోత్సవాల ముగింపు సభకు విచ్చేసిన ఆమె ఆదివారం విలేకరులతో కొద్ది సేపు మాట్లాడారు.ఏ పార్టీలో చేరతారని ప్రశ్నించగా సమయం వచ్చినపుడు తానే చెబుతానన్నారు.నిజజీవితం,రాజకీయాల్లో నటించడం చేతకాకపోవడం వల్లనే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని చెప్పారు.

దేశ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వచ్చిన సినిమా అవకాశాలను వదులు కోవడం లేదని చెప్పారు.ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న సత్యసాయిబాబా చిత్రంలో సాయిబాబాకు తల్లిగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.సత్యసాయిబాబా ప్రపంచ దేశాలకు తెలిసిన మానవరూపంలో ఉన్న దేవుడని తెలిపారు. మంచి చిత్రంలో నటిస్తున్నాననే ఆత్మ సంతృప్తి దీనిలో నటీనటులందరికీ కలుగుతుందన్నారు.

 
భూ ఆక్రమణ ఉద్యమం చేస్తాం:నారాయణ
Monday, 21 May 2012 17:58

 

గుంటూరు, మే 21,(వాస్తవం): రాష్ట్ర ప్రభుత్వం ఎస్ ఈజెడ్ లకు అన్యాయంగా కేటాయించిన భూముల్ని వెనక్కు తీసుకుని,రైతులకు ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగతామని,భూ ఆక్రమణ ఉద్యమం చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం-సమస్యలు-పరిష్కార మార్గాలు అన్న అంశంపై  సీపీఐ గుంటూరు జిల్లా సమితి,రాష్ట్ర రైతు సంఘం  సం యుక్తంగా ఆది,సోమవారాల్లో ఇక్కడ నిర్వహిస్తున్న  సింపోజియంలో పాల్గొనేందుకు నారాయణ వచ్చారు.ఆ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రుల్ని తక్షణం డిస్మిస్ చేయాలని  డిమాండ్ చేశారు.

కాంగ్రెస్,వైకాపాలు ఒకే తానులో ముక్కలని ఉప ఎన్నికల్లో రెండు పార్టీలనూ ఓడించాలని పిలుపునిచ్చారు. వాస్ పిక్ ఒప్పందం రద్దు చేయాలన్న మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ గురించి ప్రస్తావించగా..కలిసి భూములు కాజేసిన రోజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.మోపిదేవి మత్స్ కారుల్లో చెడబుట్టాశ్డని,వాళ్లకు అన్యాయం  చేస్తున్నాడని,ఆ రోజు తాను చెబితే తన దిష్టి బొమ్మలు  దహనం చేసి,నోరు మూయించే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తాను చెప్పిందే నిజమైందని నారాయణ పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాల్లో లోపం వల్లే ప్రస్తుతం రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు.  రైతులంతా సంఘటితం కావాలని,రాజకీయ నాయుకులకు కీలెరిగి వాత పెడితే తప్ప పరిస్థితిలో మార్పురాదని ఆయన పేర్కొన్నారు.

 
దుర్గమ్మ పాదాల చెంత రామ్ చరణ్ లగ్న పత్రిక
Sunday, 20 May 2012 18:08

వాస్తవం ప్రతినిధి:  మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన కుమారుడు రామ్ చరణ్ తేజ లగ్న పత్రికను తీసుకుని బెజవాడ ఇంద్ర కీలాద్రికి చేరుకున్నారు. ఆమెకు దేవస్థానం ఇవో రఘునాథ్ స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకుని వెళ్లారు. దుర్గమ్మ పాదాల చెంత లగ్న పత్రికను ఉంచి సురేఖ పూజలు చేశారు.  ఉపాసన కామినేనితో రామ్ చరణ్ తేజ వివాహం జూన్ 14వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. వివాహానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లిని గ్రాండ్ చేయడానికి ఇరువురి కుటుంబాలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి.

వివాహ వేదికను కనీవినీ ఎరుగని రీతిలో రూపొందిస్తున్నారు. ఉపాసన ఫామ్‌హౌస్‌లో వేదికను రూపు దిద్దాలని చిరంజీవి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి సూచించారు. రిసెప్షన్ వేదికకు హంగులు అద్దుతున్నారు. పెళ్లికి చలన చిత్ర ప్రముఖులను, రాజకీయ నాయకులను, బడా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనయా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా వివాహానికి రావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి

 

Picture Of The Season

  • vastavam.net

ఆదర్శ ప్రభుత్వాధికారి




All rights on the content on this website are reserved toVastavam.net.